Share News

Chris Gayle: వాహనదారులకు ఫ్రీ గ్యాస్.. జమైకాలో క్రిస్ గేల్ ఔదార్యానికి ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , Publish Date - Jan 16 , 2024 | 01:50 PM

డాషింగ్ బ్యాట్స్‌మెన్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. గేల్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగి సిక్సర్లు బాదుతుంటే చూడడం ఓ గొప్ప అనుభూతి. గేల్ దూకుడికి ఎన్నో రికార్డులు దాసోహమయ్యాయి.

Chris Gayle: వాహనదారులకు ఫ్రీ గ్యాస్.. జమైకాలో క్రిస్ గేల్ ఔదార్యానికి ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో!

డాషింగ్ బ్యాట్స్‌మెన్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్‌కు (Chris Gayle) ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. గేల్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగి సిక్సర్లు బాదుతుంటే చూడడం ఓ గొప్ప అనుభూతి. గేల్ దూకుడికి ఎన్నో రికార్డులు దాసోహమయ్యాయి. మైదానంలో ఎంతో దూకుడుగా బ్యాటింగ్ చేసే గేల్, మైదానం వెలుపల మాత్రం సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత గేల్ తాజాగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు (Chris Gayle Video).

హఠాత్తుగా జమైకా (Jamaica)లోని ఓ గ్యాస్ స్టేషన్‌లో (Gas station) క్రిస్ గేల్ ప్రత్యక్షమయ్యాడు. జమైకాలోని ఒక‌ గ్యాస్ స్టేష‌న్‌లో కనిపించి అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు అక్కడకు వచ్చిన వాహ‌న‌దారుల‌కు ఉచితంగా గ్యాస్ కొట్టించాడు. పోర్ట్‌మోర్ గ్యాస్ స్టేష‌న్‌ (Portmore Gas Station)లో గేల్ సందడి చేశాడు. అక్కడకు వచ్చిన వాళ్లతో సరదాగా మాట్లాడాడు. వారితో కలిసి సెల్ఫీలు దిగాడు. @Tropixsofficial అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియోను కొద్ది గంటల్లోనే 1.27 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ``గేల్ ఎప్పుడూ ఇలా షాక్‌లు ఇస్తుంటాడు``, ``గేల్ గర్వానికి చాలా దూరంగా ఉంటాడు``, ``తాగిన మైకంలో అలా చేశాడేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, 44 ఏళ్ల గేల్ ప్రపంచ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఏకంగా ఆరు సెంచరీలు కొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

Updated Date - Jan 16 , 2024 | 01:50 PM