Share News

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. కాంట్రాక్ట్ ఎంతకాలం అంటే?

ABN , Publish Date - Jul 09 , 2024 | 08:39 PM

టీమిండియా అభిమానులు కోరుకున్నదే నిజమైంది. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం కన్ఫమ్ అయిపోయింది. బీసీసీఐ మంగళవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా...

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. కాంట్రాక్ట్ ఎంతకాలం అంటే?
Gautam Gambhir

టీమిండియా అభిమానులు కోరుకున్నదే నిజమైంది. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నియామకం కన్ఫమ్ అయిపోయింది. బీసీసీఐ (BCCI) మంగళవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌ని నియమించడం జరిగిందని, అతడు రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడని వెల్లడించింది. ఆగస్టులో శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లతో అతడు ప్రధాన కోచ్‌గా రంగంలోకి దిగబోతున్నాడని ఖరారైంది.


రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం పూర్తవుతుందన్న సమయంలో.. చాలామంది పేర్లు తెరమీదకి వచ్చాయి. అందులో కొందరు విదేశీ ఆటగాళ్లూ ఉన్నారు. కానీ.. ఎప్పుడైతే జై షా దేశవాళీ క్రికెట్‌పై లోతుగా అవగాహన ఉన్న భారతీయుడే కోచ్ అవుతాడని చెప్పాడో, అప్పటి నుంచి గౌతమ్ గంభీర్ పేరు మార్మోగిపోయింది. అదే టైంలో ఐపీఎల్‌లో మెంటార్‌గా వ్యవహరించిన కేకేఆర్ జట్టు టైటిల్ సాధించడంతో, ఇక కోచ్‌గా గంభీర్ కన్ఫమ్ అని అందరూ అప్పుడే అనుకున్నారు. కానీ.. ఇంతలోనే రామన్ సడెన్ ఎంట్రీ ఇచ్చి కాస్త షాకిచ్చాడు. తనదైన క్రికెట్ నాలెడ్జ్‌తో అతను బీసీసీఐ అధికారుల మనసుల్ని గెలుచుకోగలిగాడు. అయితే.. ఫైనల్‌గా గంభీరే బీసీసీఐ హాట్ ఫేవరేట్ అయ్యాడు. ద్రవిడ్ స్థానంలో అతను కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.


ఈ విషయంపై ఎక్స్ వేదికగా బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ.. ‘‘భారత క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని నేను స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది, గౌతమ్ ఈ మార్పుల్ని దగ్గరుండి మరీ చూశాడు. తన కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని వివిధ పాత్రల్లో రాణించిన గంభీర్.. భారత క్రికెట్‌ను ముందుకు నడిపించేందుకు అనువైన వ్యక్తి అని నేను విశ్వసిస్తున్నాను. టీమిండియాపై అతనికి ఓ స్పష్టమైన విజన్ ఉంది. ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న అతనికి బీసీసీఐ పూర్తి మద్దతు ఇస్తుంది’’ అంటూ పేర్కొన్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 08:39 PM