Share News

India vs England: ముగిసిన మూడో రోజు ఆట.. శతక్కొట్టిన ఓలీ పోప్

ABN , Publish Date - Jan 27 , 2024 | 05:30 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ శతక్కొట్టడంతో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేయగలిగింది.

India vs England: ముగిసిన మూడో రోజు ఆట.. శతక్కొట్టిన ఓలీ పోప్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ శతక్కొట్టడంతో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేయగలిగింది. దీంతో.. ప్రత్యర్థి జట్టు 126 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. నిజానికి.. తొలి ఇన్నింగ్స్‌లో ఎలాగైతే ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే చాపచుట్టేసిందో, రెండో ఇన్నింగ్స్‌లోనూ అలాగే చేతులెత్తేస్తుందని అంతా అనుకున్నారు. భారత బౌలర్లు మంచి జోష్‌లో ఉన్నారు కాబట్టి, వారి ధాటికి ఎక్కువసేపు క్రీజులో నిలకడగా రాణించలేరని, ఎక్కువ ఆధిక్యం సాధించకుండానే తట్టాబుట్టా సర్దేయొచ్చని అందరూ భావించారు.


ఆ అంచనాలకి తగినట్టుగానే భారత బౌలర్లు మొదట్లో కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో.. 140 పరుగులకే ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది. ఇక ఇంగ్లండ్ కథ ముగిసినట్టేనని అనుకున్న తరుణంలో.. ఓలీ పోప్ ఆ అంచనాలను తిప్పికొట్టాడు. అతడు క్రీజులో పాతుకుపోయి, సెంచరీతో చెలరేగాడు. ఒంటరి పోరాటం కొనసాగిస్తూ.. తన జట్టుని కుప్పకూలనీయకుండా ఆదుకున్నాడు. 145 బంతుల్లోనే అతడు 10 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. బెన్ వోక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే.. 275 పరుగుల వద్ద ఓక్స్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పోప్, రిహాన్ అహ్మద్‌లు ఉన్నారు. భారత బౌలర్ల విషయానికొస్తే.. బుమ్రా, అశ్విన్ తలా రెండు.. అక్షర్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

Updated Date - Jan 27 , 2024 | 05:30 PM