Home » India vs England Test Series
ఐదో టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. మూడో రోజు ఆటలో తొలి సెషన్లో 259 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు లంచ్ విరామ సమయానికే సగం వికెట్లు కోల్పోయింది.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో చివరి మ్యాచ్ ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారత్, ఇంగ్లండ్ మధ్య (India vs England) 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టుకు (Dharmasala Test) 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకున్న టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్టులోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో టెస్టు మ్యాచులో కూడా భారత్ అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
టీమ్ ఇండియా(team india) విజయం దిశగా వేగంగా దూసుకుపోతోంది. రాంచీ(ranchi) టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత్ విజయానికి ఇంకా ఎన్ని పరుగులు చేయాలో ఇప్పుడు చుద్దాం.
భారతీయ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా ‘ఆల్ టైమ్ గ్రేట్’ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో బెన్ డకెట్, ఒల్లీ పోప్ వికెట్లను తీసిన అశ్విన్ టెస్ట్ ఫార్మాట్లో స్వదేశంలో 351 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందున్న అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు.
రాంచీలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈరోజు పోటీలో మూడో రోజు కాగా భారత జట్టు ఆలౌట్ అయ్యింది. అయితే ఎన్ని పరుగులు చేశారు. ఆ వివరాలేంటనేది ఇక్కడ చుద్దాం.
రాంచీ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. జో రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
రాంచీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టులో ఆకాశ్ దీప్(Akash Deep) భారత్ తరఫున అరంగేట్రం చేసి అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుతాలు చేసి ఇంగ్లిష్ టాప్ ఆర్డర్‌ను ఔట్ చేసి వావ్ అనిపించుకున్నాడు.