India vs England: ఇంగ్లండ్‌తో 5వ టెస్టుకు టీమ్‌ని ప్రకటించిన బీసీసీఐ.. రీ ఎంట్రీ ఇస్తున్న స్టార్ ప్లేయర్
ABN , Publish Date - Feb 29 , 2024 | 03:12 PM
భారత్, ఇంగ్లండ్ మధ్య (India vs England) 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టుకు (Dharmasala Test) 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.
భారత్, ఇంగ్లండ్ మధ్య (India vs England) 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టుకు (Dharmasala Test) 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఈ మ్యాచ్ కూడా దూరమవనున్నాడని తెలిపింది. ఇక నాలుగవ టెస్ట్ మ్యాచ్‌కు విరామం తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి ఈ మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రకటించింది.
ధర్మశాల వేదికగా మార్చి 7న ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. గాయంతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ వైద్య నిపుణులను సంప్రదించేందుకు లండన్ వెళ్లాడని ప్రస్తావించింది.
బీసీసీఐ బృందం కేఎల్ రాహుల్‌ను నిశితంగా పరిశీలిస్తోందని, లండన్‌లోని వైద్యులతో సమన్వయం చేసుకునంటున్నామని ఒక ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. ఇక ముంబై వర్సెస్ తమిళనాడు మధ్య రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్లో ఆడేందుకు జట్టు నుంచి ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. సుందర్ స్క్వాడ్ నుంచి విడుదల చేస్తున్నామని, మార్చి 2, 2024 నుంచి ముంబైతో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు తరపున ఆడనున్నాడని వివరించింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత తిరిగి భారత జట్టుతో కలుస్తాడని వివరించింది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఆడిన మిగతా జట్టు యథావిథిగా ఉంటుందని బీసీసీఐ వివరించింది.
ఇంగ్లండ్‌తో 5వ టెస్టుకు జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.
ఇవి కూడా చదవండి..
బోర్డును ధిక్కరించిన ఇషాన్, అయ్యర్‌పై వేటు
నాగ్‌పూర్, ముంబైల్లో రంజీ సెమీస్
మరిన్ని స్టోర్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి