India vs England: తొలిరోజు అదరగొట్టిన బౌలర్లు.. ఇంగ్లండ్ ఆలౌట్
ABN , Publish Date - Mar 07 , 2024 | 02:47 PM
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో చివరి మ్యాచ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, ఇంగ్లండ్(India vs England) మధ్య ఐదో చివరి మ్యాచ్(5th test) ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 3-1 ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌లో కూడా భారత జట్టు విజయం సాధించాలని చూస్తోంది. మరోవైపు టీమిండియా(team india)ను కట్టడి చేయాలని ఇంగ్లండ్ జట్టు ప్రయత్నిస్తోంది. అయితే ఈ టెస్టులో కూడా భారత్ గెలిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశం ఉంది.
భారత్‌తో జరుగుతున్న ఈ మ్యాచులో తొలి రోజు ఇంగ్లండ్(England) 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ తరఫున ఇప్పటి వరకు కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) ఐదు వికెట్లు, అశ్విన్ నాలుగు, జడేజా ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ అద్భుతంగా ఆడి బ్యాటింగ్ చేశారు. జాక్ క్రాలే 79 రన్స్ చేయగా, బెన్ డకెట్ 27, జానీ బెయిర్‌స్టో 29 పరుగులు చేశారు.
దేవదత్ పడిక్కల్ ఈ సిరీస్‌లో భారత(Bharat) జట్టులో తన అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఐదవ భారతీయ ఆటగాడు. చీలమండ గాయం కారణంగా రజత్ పాటిదార్ ప్లేయింగ్ 11కి దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IND vs ENG 5th Test: చివరి టెస్టులో యశస్వీ జైస్వాల్‌ను ఊరిస్తున్న 6 రికార్డులివే!