India vs England 4th Test: భారత్ బ్యాటింగ్.. గెలుపు కోసం ఇంకా ఎన్ని పరుగులంటే
ABN , Publish Date - Feb 26 , 2024 | 10:27 AM
టీమ్ ఇండియా(team india) విజయం దిశగా వేగంగా దూసుకుపోతోంది. రాంచీ(ranchi) టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత్ విజయానికి ఇంకా ఎన్ని పరుగులు చేయాలో ఇప్పుడు చుద్దాం.
టీమ్ ఇండియా(India) విజయం దిశగా వేగంగా దూసుకుపోతోంది. రాంచీ(ranchi) టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్(England) బౌలింగ్‌ను అండర్సన్ ప్రారంభించాడు. ప్రస్తుతం భారత జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 37 రన్స్ చేసి ఔట్ కాగా, రోహిత్ శర్మ 50 పరుగులతో ఆడుతుండగా..జైస్వాల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో టీం ఇండియా గెలవాలంటే ఇంకా 103 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: అదిగదిగో సిరీస్
మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ వరకు ఇంగ్లండ్ జట్టు ముందుంది. అయితే నాలుగో రోజుకి మాత్రం భారత్‌దే పైచేయి అయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని పక్కాగా తెలుస్తోంది. భారత్ గెలిస్తే రాంచీ(ranchi)లో ముందుగా బౌలింగ్ చేసి టెస్టుల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి కానుంది. రాంచీ టెస్టులో భారత్ గెలిస్తే 5 టెస్టుల సిరీస్‌ను మాత్రమే కాకుండా, ఈ వేదికపై ఆడిన 3 టెస్టుల్లో ఇది రెండో విజయం అవుతుంది.
ఇంతకు ముందు ఆడిన రెండు టెస్టుల్లో ఒకటి విజయం సాధించగా, మరొకటి డ్రాగా ముగిసింది. గత 10 ఏళ్లలో భారత్ 150 ప్లస్ లక్ష్యాన్ని ఒక్కసారి మాత్రమే విజయవంతంగా ఛేదించింది. రాంచీ టెస్టులో భారత్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించింది.