Share News

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN , Publish Date - May 19 , 2024 | 03:17 PM

నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇరు జట్లకు చివరి లీగ్ మ్యాచ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

SRH vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

హైదరాబాద్: నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇరు జట్లకు చివరి లీగ్ మ్యాచ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ జితేశ్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య సన్‌రైజర్స్‌కు బౌలింగ్ అప్పగించాడు.

జట్టులో ఒకే ఒక్క మార్పు చేశామని, రాహుల్ త్రిపాఠిని జట్టులోకి తీసుకున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తెలిపారు. కాగా ఈ సీజన్‌లో భయంకరమైన ఫామ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ మ్యా్చ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ జాబితాలో ఉన్నాడు.


తుది జట్లు..

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్, టీ నటరాజన్.

పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైడే, రిలీ రూసో, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్, కెప్టెన్), అశుతోశ్ శర్మ, శివమ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్

Updated Date - May 19 , 2024 | 03:35 PM