Share News

Virat Kohli: టీమిండియాలో కోహ్లీ.. ఆసిస్‌లో స్మిత్.. ఇద్దరిదీ ఒక్కటే స్టైల్

ABN , Publish Date - Nov 19 , 2024 | 07:54 PM

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కారణం కోహ్లీ వయసేనంటూ సీనియర్ చేసిన కామెంట్స్..

Virat Kohli: టీమిండియాలో కోహ్లీ.. ఆసిస్‌లో స్మిత్.. ఇద్దరిదీ ఒక్కటే స్టైల్
Virat Kohli

ముంబై: న్యూజిలాండ్ తో సిరీస్ కి ముందు నుంచే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను అందుకోవడంలో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీనియర్ క్రికెటర్ రవిశాస్త్రి కోహ్లీపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కోహ్లీకి వయసు పైబడుతుండటంతోనే అతడి ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడని అన్నాడు. అయితే, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ అతనికి తన పాత ఫామ్ ను తిరిగి అందుకునే అవకాశాన్ని ఇస్తుందన్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో విరాట్ 6 ఇన్నింగ్స్‌ల్లో 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో అసలు సిసలైన కోహ్లిని చూడాలని అతడి అభిమానులు ఎదురుచూస్తున్నారు. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభ టెస్టులో జట్టు తలపడనుండగా, విరాట్ 'ఇన్-ది-ఫేస్' వైఖరి తిరిగి తగ్గుతుందని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి భావిస్తున్నారు.


‘‘వయసు రిత్యా కోహ్లీ తన ఫామ్ ను అందుకోలేక ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ టెస్టు సిరీస్ ప్రారంభంలో కోహ్లీ మళ్లీ ఓ వెలుగు వెలగడం మీరు చూస్తారని నాకు అనిపిస్తోంది. కోహ్లీని మునుపటి ఫామ్ తో చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను’’ అని శాస్త్రి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపాడు. కోహ్లి, స్టీవ్ స్మిత్‌ల మధ్య ఒక విషయంలో దగ్గరి పోలికలు ఉన్నాయన్నాడు. వీరిద్దరూ ఫామ్ తో సంబంధం లేకుండా తమ ప్రత్యేకతను చాటుకుంటారన్నాడు. మొదట తడబడినా తర్వాత నిలదొక్కుకుని పోరాడి గెలుస్తారన్నాడు. సిరీస్ ప్రారంభానికి ముందు ఆర్గనైజ్డ్ వార్మప్ మ్యాచ్‌లు లేకపోవడంపై భారత జట్టు విమర్శలను ఎదుర్కొంది. వ్యవస్థీకృత పోటీలో భారతదేశపు మొదటి ఎలెవన్ జట్టుతో ఆడడాన్ని చూడాలనుకుంటున్నట్టు శాస్త్రి చెప్పాడు. కానీ, అతను ఇంట్రా-స్క్వాడ్ 3-రోజుల సిమ్యులేషన్ గేమ్‌తో సరిపెట్టాడన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 07:54 PM