Ruturaj Gaikwad: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రనౌట్.. ఇలా ఎవరూ ఔటై ఉండరేమో!
ABN , Publish Date - Jun 09 , 2024 | 10:28 AM
అప్పుడప్పుడు క్రికెట్ మైదానంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతుంటాయి. క్రికెటర్లకు ఎదురయ్యే అనుభవాల దగ్గర నుంచి ఆటగాళ్లు ఔటయ్యే తీరు దాకా.. చాలా విచిత్రమైన సంఘటనలు...
అప్పుడప్పుడు క్రికెట్ మైదానంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతుంటాయి. క్రికెటర్లకు ఎదురయ్యే అనుభవాల దగ్గర నుంచి ఆటగాళ్లు ఔటయ్యే తీరు దాకా.. చాలా విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఓ ఆశ్చర్యకరమైన రనౌట్ చోటు చేసుకుంది. టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) వినూత్న రీతిలో రనౌటై వార్తల్లో నిలిచాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలా ఎవరూ రనైటే ఉండరు. ఆ వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో భాగంగా.. పుణేరీ బప్పా, రత్నగిరి జెట్స్ మధ్య జూన్ 7వ తేదీన మ్యాచ్ జరిగింది. పుణేరీ బప్పా టీమ్‌కు సారథ్యం వహిస్తున్న రుతురాజ్.. ఆ మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా రనౌట్ అయ్యాడు. 11వ ఓవర్లో ఒక షాట్ కొట్టిన అనంతరం.. రుతు రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే.. రెండో పరుగుని పూర్తి చేసే క్రమంలో క్రీజులోకి చేరుకోకముందే అతని చేతికి, బ్యాట్‌కు కనెక్షన్ కట్ అయ్యింది. అంటే.. అతని చేతి నుంచి బ్యాట్ జారిపోయింది. నిజానికి.. బ్యాట్ క్రీజుని తాకింది కానీ, రుతు మాత్రం ఇంకా గాల్లోనే ఉన్నాడు. ఈలోపు వికెట్‌కీపర్ బంతిని అందుకొని వికెట్లను గిరాటు వేశాడు. దీంతో అతడిని ఔట్‌గా ప్రకటించాడు.
ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో రుతురాజ్ బ్యాట్ క్రీజుకి తాకినట్లు స్పష్టంగా కనిపిస్తోంది కానీ.. అతని చేతిలో మాత్రం బ్యాట్ లేదు. నేలను తాకడం వల్ల అది అతని చేతి నుంచి జారిపోయింది. అతను మాత్రం క్రీజులోకి వెళ్లకుండా ఇంకా గాల్లోనే ఉండిపోయాడు. అందుకే.. థర్డ్ అంపైర్ రనౌట్ ఇచ్చేశాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ.. ఈ ఔట్ మాత్రం క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్ రనౌట్‌గా నిలిచిపోతుందని క్రికెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో పుణేరీ బప్పా జట్టు ప్రత్యర్థి రత్నగిరి జెట్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Read Latest Sports News and Telugu News