Share News

Shaheen Afridi: చిక్కుల్లో పాకిస్తాన్ పేసర్ షాహీన్ ఆఫ్రిది.. అతనేం చేశాడో తెలిస్తే..

ABN , Publish Date - Jul 11 , 2024 | 03:54 PM

సాధారణంగా.. ప్రజాదరణ కలిగిన సెలెబ్రిటీలు ఎంతో హుందాగా వ్యవహరిస్తారు. ప్రతి ఒక్కరితోనూ స్నేహపూర్వకంగా మెలుగుతూ.. మంచి ఇమేజ్ సంపాదించుకుంటారు. కానీ..

Shaheen Afridi: చిక్కుల్లో పాకిస్తాన్ పేసర్ షాహీన్ ఆఫ్రిది.. అతనేం చేశాడో తెలిస్తే..
Shaheen Afridi

సాధారణంగా.. ప్రజాదరణ కలిగిన సెలెబ్రిటీలు (క్రీడాకారులతో సహా) ఎంతో హుందాగా వ్యవహరిస్తారు. ప్రతి ఒక్కరితోనూ స్నేహపూర్వకంగా మెలుగుతూ.. మంచి ఇమేజ్ సంపాదించుకుంటారు. కానీ.. కొందరు మాత్రం అలా ఉండరు. తమకున్న క్రేజ్, బ్యాక్‌గ్రౌండ్‌ని చూసుకొని రెచ్చిపోతుంటారు. ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తుంటారు. పాకిస్తాన్ పేసర్ షాహీన్ ఆఫ్రిది (Shaheen Afridi) కూడా అలాంటి వాడేనని తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బయటి ప్రపంచానికి తెలియని మరో కోణం అతనిలో ఉందంటూ తేలింది.


రిపోర్ట్స్ ప్రకారం.. టీ20 వరల్డ్‌కప్-2024 సమయంలో హెడ్ కోచ్ గేరి క్రిస్టన్, అజార్ మహమూద్ పట్ల షాహీన్ ఆఫ్రిది దురుసుగా ప్రవర్తించాడని తెలిసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ల సమయంలోనూ అలాగే వ్యవహరించాడట. ఇతర స్టాఫ్ సభ్యులతోనూ గొడవకు దిగాడని తెలిసింది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి (పీసీబీ) చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘రీసెంట్ టూర్లలో టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు కోచ్‌ల పట్ల షాహీన్ దురుసుగా ప్రవర్తించాడు. కనీసం మర్యాద లేకుండా వ్యవహరించాడు. అయినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని పేర్కొన్నాడు. టీమ్‌లో క్రమశిక్షణను కొనసాగించడం నిర్వాహకుల బాధ్యత అని, అందుకే షాహీన్‌ తప్పు చేసినా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపాడు.


ఇదే సమయంలో.. లాబీయింగ్‌కి పాల్పడటంతో పాటు టోర్నీల్లో బాధ్యతగా ఆడటం లేదని కోచ్‌లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొందరు ఆటగాళ్లపై విచారణ చేపట్టారని సమాచారం. ‘‘ఈమధ్య కాలంలో కొందరు ఆటగాళ్లు లాబీయింగ్‌కి పాల్పడ్డారు. అలాగే.. టోర్నీల్లో ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు. ఈ విషయంపై పీసీబీ ఛైర్మన్‌కు పిర్యాదు అందడంతో, విచారణ ప్రారంభించారు’’ అని పీసీబీ అధికారి చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా.. టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తరుణంలో.. సెలక్షన్ కమిటీ నుంచి వాహబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లను తొలగించిన విషయం అందరికీ తెలిసిందే.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 03:54 PM