SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. 300 కొడతారా?
ABN , Publish Date - May 02 , 2024 | 07:14 PM
ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. గత సీజన్లలో...
ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. గత సీజన్లలో ఎన్నడూ లేనంత ఫుల్ జోష్‌లో ఉన్న హైదరాబాద్ జట్టు గత రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాల్ని చవిచూసింది. దీంతో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. రాజస్థాన్‌పై అఖండ విజయాన్ని నమోదు చేసి.. ప్రస్తుతమున్న ఐదో స్థానం నుంచి ఎగబాకి, టాప్-4లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది.
ఇదే సమయంలో.. సన్‌రైజర్స్‌లో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు కాబట్టి, ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 300 పరుగులు కొట్టగలుగుతుందా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ జట్టు ఏకంగా మూడుసార్లు 260+ పరుగులను నమోదు చేసింది. అందునా.. 287 పరుగులు చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది. 300 పరుగుల దరిదాపుల్లోకి వచ్చింది కాబట్టి.. ఆ మార్క్‌ని అందుకోవడం సన్‌రైజర్స్‌కి పెద్ద కష్టమేమీ కాదని అందరూ అనుకుంటున్నారు. మరి.. అభిమానుల అంచనా మేరకు సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో 300 పరుగులు చేయగలుగుతుందా? లేదా? అనేది చూడాలి.
మరోవైపు.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తిరుగులేని జట్టుగా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఆర్ఆర్.. కేవలం ఒక్కసారే ఓటమి చవిచూసింది. మిగతా ఎనిమిది మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ జైత్రయాత్రను ఇలాగే కొనసాగించాలని భావిస్తున్న ఈ జట్టు.. హైదరాబాద్‌పై కూడా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో? ఎవరు ఓటమి పాలవుతారో.. వేచి చూడాల్సిందే.