Dinesh Karthik: దినేష్ కార్తీక్‌కు 2 కీలక పదవులు.. ఐపీఎల్ 2025లో ఈ జట్టు తరఫున..
ABN , Publish Date - Jul 01 , 2024 | 11:28 AM
ఐపీఎల్ RCB జట్టులో ప్రతిసారీ దాదాపు మంచి ఆటగాళ్లు ఉంటారు. కానీ ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేకపోయింది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ కార్తీక్‌కు(Dinesh Karthik) కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ RCB జట్టులో ప్రతిసారీ దాదాపు మంచి ఆటగాళ్లు ఉంటారు. కానీ ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేకపోయింది. ఇటివల ఐపీఎల్ 2024(Ipl 2024) ఎలిమినేటర్‌కు చేరుకున్న ఈ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో RCB IPL 2025కి ముందు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ కార్తీక్‌కు(Dinesh Karthik) కీలక బాధ్యతలను అప్పగించింది. దీంతో IPL 2025కి RCB తరఫున దినేష్ కార్తీక్ బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా నియమించబడ్డారు.
దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఆర్‌సీబీ(RCB) సోషల్ మీడియాలో షేర్ చేసింది. కార్తీక్ గత సీజన్ ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడు. అతని కెరీర్ ఇప్పటివరకు అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కార్తీక్ కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో పాటు ఇతర జట్లకు కార్తీక్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అతనికి అద్భుతమైన రికార్డు ఉంది.
ఇప్పటి వరకు దినేష్ కార్తీక్(Dinesh Karthik) ఐపీఎల్ ప్రదర్శనను పరిశీలిస్తే అద్భుతంగా రాణించాడని చెప్పవచ్చు. కార్తీక్ గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, KKR, ఆర్బీసీ తరపున కూడా ఆడాడు. ఆ క్రమంలో కార్తీక్ 257 మ్యాచ్‌లు ఆడి 4,842 పరుగులు చేశాడు. కార్తీక్ 22 హాఫ్ సెంచరీలు చేయగా, అత్యుత్తమ స్కోరు 97 పరుగులు నాటౌట్. కార్తీక్ 2024లో 15 మ్యాచ్‌ల్లో 326 పరుగులు చేశాడు.
ఫినిషర్‌గా కూడా సక్సెస్ అయ్యాడు. IPL 2024లో RCB జట్టు ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఐపీఎల్‌లో ఆటగాడిగా అతనికి ఇదే చివరి మ్యాచ్. దీని తర్వాత అతను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ముంబై ఇండియన్స్‌తో కలిసి IPL 2013 టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. అతనికి క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Cricket: టీమిండియా కొత్త కోచ్.. కెప్టెన్‌పై జైషా సంచలన ప్రకటన..
Alert: జులై 1 నుంచి దేశంలో వచ్చిన 10 కీలక ఆర్థిక మార్పులివే
Read More Sports News and Latest Telugu News