Share News

Glenn Maxwell: వెస్టిండీస్‌పై మ్యాక్‌వెల్ విధ్వంసం.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును సమం

ABN , Publish Date - Feb 11 , 2024 | 04:45 PM

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. అడిలైట్‌లోని ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌పై 2వ టీ20 మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. కేవలం 50 బంతుల్లోనే మెరుపు శతకాన్ని నమోదు చేశాడు.

Glenn Maxwell: వెస్టిండీస్‌పై మ్యాక్‌వెల్ విధ్వంసం.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును సమం

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. అడిలైట్‌లోని ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌పై 2వ టీ20 మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. కేవలం 50 బంతుల్లోనే మెరుపు శతకాన్ని నమోదు చేశాడు. ఏకంగా 8 సిక్సర్లు, 12 ఫోర్లతో 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీ20 కెరీర్‌లో 5వ సెంచరీ నమోదు చేసిన గ్లేన్ మ్యాక్స్‌వెల్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును సమం చేశాడు.

టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో హిట్‌మ్యాన్ సరసన మ్యాక్స్‌వెల్ నిలిచాడు. చెరో 5 సెంచరీలతో ఇద్దరూ సమంగా నిలిచారు. కాగా మ్యాక్స్‌వెల్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా ఏకంగా 241 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. షమర్ జోసెఫ్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ ఏకంగా 109 మీటర్ల సిక్సర్ బాదాడు.

టీ20ల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే..

1. రోహిత్ శర్మ - 5 శతకాలు (143 ఇన్నింగ్స్‌)

2. గ్లెన్ మాక్స్‌వెల్ - 5 (94 ఇన్నింగ్స్)

3. సూర్యకుమార్ యాదవ్ - 4 (57 ఇన్నింగ్స్)

4. బాబర్ ఆజం - 3 (103 ఇన్నింగ్స్)

5. కోలిన్ మన్రో - 3 ( 62 ఇన్నింగ్స్‌).

Updated Date - Feb 11 , 2024 | 04:45 PM