IPL2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్‌లో అదరగొట్టిన టీమిండియా ఆటగాడు దూరం!
ABN , Publish Date - Feb 22 , 2024 | 04:24 PM
చీలమండ గాయం కారణంగా స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడడం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘‘ చీలమండ గాయానికి ప్రత్యేక ఇంజెక్షన్లు తీసుకోవడానికి జనవరి చివరి వారంలో షమీ లండన్ వెళ్లాడు. మూడు వారాల తర్వాత చిన్నగా పరిగెత్తవచ్చని వైద్యులు సూచించారు. కానీ ఇంజెక్షన్ ప్రభావం చూపలేకపోయింది. దీంతో ప్రస్తుతం సర్జరీ మాత్రమే ఏకైక మార్గంగా ఉంది. శస్త్రచికిత్స కోసం షమీ త్వరలోనే యూకేకి వెళ్తాడు. ఐపీఎల్‌లో ఆడడం సందేహమే’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఐపీఎల్2024(IPL2024) ఎడిషన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు (Gujarat Titans) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన స్టార్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడడం అనుమానంగా మారింది. ఎడమకాలు చీలమండ గాయం కారణంగా షమీ దూరమవ్వనున్నాడని, యూకేలో అతడు చికిత్స తీసుకోనున్నాడని బీసీసీఐ వర్గాలు చెప్పినట్టుగా పీటీఐ రిపోర్ట్ పేర్కొంది. ‘‘ చీలమండ గాయానికి ప్రత్యేక ఇంజెక్షన్లు తీసుకోవడానికి జనవరి చివరి వారంలో షమీ లండన్ వెళ్లాడు. మూడు వారాల తర్వాత చిన్నగా పరిగెత్తవచ్చని వైద్యులు సూచించారు. కానీ ఇంజెక్షన్ ప్రభావం చూపలేకపోయింది. దీంతో ప్రస్తుతం సర్జరీ మాత్రమే ఏకైక మార్గంగా ఉంది. శస్త్రచికిత్స కోసం షమీ త్వరలోనే యూకేకి వెళ్తాడు. ఐపీఎల్‌లో ఆడడం సందేహమే’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
‘‘ నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్ణయం ప్రకారం సర్జరీ కోసం షమీ నేరుగా యూకేకి వెళ్లాల్సి ఉంది. 2 నెలల విశ్రాంతి, కొన్ని ప్రత్యేక ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ అవి పనిచేయలేదు. షమీ ప్రత్యేకమైన ఆటగాడు. టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటనలో అతడి అవసరం ఎంతైనా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో 33 ఏళ్ల షమీ అదరగొట్టాడు. 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అప్పటికే చీలమండి గాయం ఉన్నప్పటికీ ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపకుండా షమీ ఆడాడు. మరోవైపు ఇటీవలే షమీ ‘అర్జున అవార్డు’ అందుకున్నాడు. దాదాపు పదేళ్ల అనుభవం ఉన్న షమీ టెస్టుల్లో 229 వికెట్లు, వన్డేల్లో 195 వికెట్లు, టీ20 ఫార్మాట్‌లో 24 వికెట్లు తీశాడు.
ఇది కూడా చదవండి
Yashasvi Jaiswal: రూ.5.38 కోట్లతో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్... నిజమేనా?
India vs England: బుమ్రా లేడు.. ఎలా ఇప్పుడు?
మరిన్ని స్టోర్ట్స్ వార్తల కోసం క్లిక్ చేయండి