Share News

Hardik Pandya: జీవితంలో చాలా చెడును ఎదుర్కొన్నా.. నేనెప్పుడూ భయపడి పారిపోను: హార్దిక్ పాండ్యా

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:32 PM

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దానికి తగ్గట్టే అతడి నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైంది.

Hardik Pandya: జీవితంలో చాలా చెడును ఎదుర్కొన్నా.. నేనెప్పుడూ భయపడి పారిపోను: హార్దిక్ పాండ్యా
Hardik Pandya

ఐపీఎల్‌ (IPL 2024)లో ముంబై ఇండియన్స్‌ (MI)కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దానికి తగ్గట్టే అతడి నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైంది. చాలా తక్కువ మ్యాచ్‌లే గెలవగలిగింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబై వైఫల్యానికి హార్దిక్ పాండ్యానే కారణం అంటూ విమర్శలు చెలరేగాయి. విపరీతంగా ట్రోలింగ్ నడిచింది.


ఐపీఎల్ పూర్తయిన వెంటనే హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం బయటకు వచ్చింది. హార్దిక్ భార్య నటాషా (Natasa Stankovic) సోషల్ మీడియాలో తన పేరు చివర ఉండే పాండ్యా అనే పేరును తొలగించింది. ఇప్పటికే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి (Hardik Pandya divorce). మరోవైపు ఫామ్‌లో లేకపోయినా ప్రపంచకప్‌లోకి ఎంపిక కావడంపై విమర్శలు వచ్చాయి. ఈ సమస్యలన్నింటిపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న పాండ్యా తాజాగా స్పందించాడు. ఇలాంటి కష్టాలు తనకు కొత్త కాదని అన్నాడు.


``జీవితమనే యుద్ధంలో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. పోరాడుతూ ఉంటే కచ్చితంగా మంచి రోజులు వస్తాయి. జీవితంలో ఎప్పుడూ చెడే ఉండదు. మంచి కూడా ఉంటుంది. చెడును చూసి భయపడి పారిపోకూడదు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా. వాటి నుంచి బయటకు వచ్చా. నేను జీవితంలో మంచి ఫేజ్‌లో ఉన్నప్పుడు కూడా దానిని సీరియస్‌గా తీసుకోను. అది శాశ్వతం అనుకోను. చేయాల్సిన పనిపైనే దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలి`` అని పాండ్యా పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

ICC T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024.. కెనడాను ఓడించిన అమెరికా


Classical Chess: క్లాసికల్ చెస్‌లో మళ్లీ వావ్ అనిపించిన ప్రజ్ఞానంద.. ప్రపంచ నం.2ను కూడా..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 02 , 2024 | 04:32 PM