Share News

Viral Video: డివోస్ తర్వాత తొలిసారి కుమారున్ని కలుసుకున్న హార్దిక్.. సంతోషంలో

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:14 PM

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే పాండ్యా భార్య నటాషా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన నాలుగేళ్ల కుమారుడు అగస్త్యను మొదటిసారి కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: డివోస్ తర్వాత తొలిసారి కుమారున్ని కలుసుకున్న హార్దిక్.. సంతోషంలో
Hardik Pandya met his son Agastya

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారిగా తన నాలుగేళ్ల కుమారుడు అగస్త్యను(Agastya) కలిశాడు. ఈ ఏడాది జులైలో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో అగస్త్య విడాకుల తర్వాత నటాషాతో కలిసి సెర్బియా వెళ్లాడు. ఈ నెల ప్రారంభంలో నటాషా ముంబైలోని హార్దిక్ ఇంట్లో అగస్త్యను విడిచిపెట్టింది. అయితే హార్దిక్ సెలవులో ఉన్నందున ఆ సమయంలో తన కొడుకును కలిసే అవకాశం లేకుండా పోయింది. తాజాగా తన కొడుకు అగస్త్యను మొదటిసారి కలుసుకున్న తర్వాత హార్దిక్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఆనందంలో

వీడియోలో హార్దిక్ చేతుల్లో అగస్త్య, అతని సోదరుడు కృనాల్ పాండ్యా కొడుకును పట్టుకున్నట్లు కనిపిస్తుంది. కొడుకుని మళ్ళీ కలుసుకున్న క్రమంలో పాండ్యా ఎంతో సంతోషంగా కనిపించాడు. అంతేకాదు ఈ విషయాన్ని హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన కొడుకుతో ఉన్న చిత్రాలను పంచుకుని "హ్యాపీనెస్" అంటూ రాసి పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే 16 లక్షలకుపైగా లైక్స్ సాధించింది. అంతేకాదు ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సూపర్ అని పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట్ వైరల్ అవుతున్న ఈ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.


గతంలో

పాండ్యా, నటాషా 2020లో నూతన సంవత్సరం రోజున నిశ్చితార్థం చేసుకున్నారు. అదే సంవత్సరం జులైలో వారికి అగస్త్య జన్మించారు. కానీ ఈ జంట మాత్రం 2023లో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వారు జూలై 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో హార్దిక్, నటాషా ఇద్దరూ తమ విడాకుల నిర్ణయాన్ని సోషల్ మీడియాలో వేదికగా బహిరంగపరిచారు. అప్పటి నుంచి వారి వారి సొంత మార్గాల్లో జీవిస్తున్నారు. నటాషా క్రికెటర్ హార్దిక్ వ్యక్తిత్వానికి అనుగుణంగా తనను తాను మార్చుకోలేకపోయిందని ఓ నివేదిక తెలిపడం విశేషం.


గవాస్కర్ ట్రోఫీ

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరీస్ కోసం హార్దిక్ భారత టెస్టు జట్టులో లేడు. హార్దిక్ ఆరేళ్లకు పైగా ఏ టెస్టు ఆడలేదు. ఇటీవల ఆయన రెడ్ బంతితో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ నేపథ్యంలో పాండ్యా రాబోయే రంజీ ట్రోఫీలో ఆడవచ్చని తెలుస్తోంది. రెడ్ బాల్ క్రికెట్‌కు తిరిగి వస్తే, ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా హార్దిక్ ఉండే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read Latest Sports News and Telugu News

Updated Date - Sep 23 , 2024 | 12:18 PM