India vs Pakistan: పాకిస్తాన్ గెలుస్తుందనుకున్నా.. అఫ్రీదిని ఓదార్చిన యువరాజ్.. ఆసక్తికర వీడియో వైరల్!
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:16 PM
యువరాజ్ సింగ్.. తొలి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించిన ఘనుడు. అసలు సిసలు బాదుడు అంటే ఎలా ఉంటుందో 2007లోనే చూపించి మజా అందించాడు. షాహిద్ అఫ్రీది.. టీ20లు పురుడు పోసుకోక ముందే హార్డ్ హిట్టింగ్ ఎలా ఉంటుందో చూపించిన చిచ్చర పిడుగు.
యువరాజ్ సింగ్ (Yuvraj Singh).. తొలి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించిన ఘనుడు. అసలు సిసలు బాదుడు అంటే ఎలా ఉంటుందో 2007లోనే చూపించి మజా అందించాడు. షాహిద్ అఫ్రీది (Shahid Afridi).. టీ20లు పురుడు పోసుకోక ముందే హార్డ్ హిట్టింగ్ ఎలా ఉంటుందో చూపించిన చిచ్చర పిడుగు. ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లు ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌నకు (T20 Worldcup) బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇటీవల న్యూయార్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే (India vs Pakistan).
అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది. సులభంగా గెలిచేస్తుందనుకున్న పాకిస్తాన్ చతికిలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా షాహిద్ ఆఫ్రీది, యువరాజ్ సింగ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యువీ-అఫ్రీది సంభాషణ ఏంటంటే..
యువీ: లాలా.. ఏమైంది? ఎందుకు అంత బాధపడుతున్నావు?
ఆఫ్రీది: నేనిలా ఉండడం తప్పా? ఒప్పా? నువ్వే చెప్పు.. అసలు మేం ఇది ఓడిపోవాల్సిన మ్యాచేనా? (కెమేరా వైపు చూస్తూ..) విజయానికి మేం 40 పరుగుల దూరంలో ఉన్నప్పుడు యువీ నా దగ్గరకు వచ్చి.. ``లాలా.. కంగ్రాట్స్! నేను మ్యాచ్ చూడను. వెళ్లిపోతున్నా`` అన్నాడు. నేను అతడిని వారించి.. ``ఇంత ముందుగానే కంగ్రాట్స్ చెప్పకు. ఈ పిచ్‌పై 40 పరుగులు అంత తేలికేం కాదు`` అన్నాను.
యువీ: పాకిస్తాన్ గెలుస్తుందని అన్నాను కానీ, టీమిండియా గెలుస్తుందనే నమ్మకంతోనే ఉన్నాను. అయినా గేమ్‌లో గెలుపోటములు సహజం. ఏదేమైనా మన మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుంది కదా!
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..