Womens T20 World Cup 2024: నేడు భారత్ vs ఆస్ట్రేలియా కీలక మ్యాచ్.. ఇన్ని రన్స్‌తో గెలిస్తేనే సెమీస్ ఛాన్స్
ABN , Publish Date - Oct 13 , 2024 | 01:41 PM
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రసవత్తరమైన మ్యాచ్ ఈరోజు మొదలుకానుంది. అయితే సెమీఫైనల్‌కు వెళ్లాలంటే మాత్రం భారత జట్టుకు భారీ విజయం తప్పనిసరి. ఒక వేళ భారత్ తక్కువ పరుగులతో గెలిచినా కూడా ఉపయోగం ఉండదు.
నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024(Womens T20 World Cup 2024)లో భారత్(team india), ఆస్ట్రేలియా(australia) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోవడానికి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించడం ద్వారా మాత్రమే భారత జట్టు సెమీఫైనల్‌కు ఛాన్స్ ఉంటుంది.
నేడు నిర్ణయం
ఈ మ్యాచ్ యూఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలుకానుంది. శ్రీలంక జట్టు ఇప్పటికే ఓటమితో గ్రూప్ ఏ నుంచి నిష్క్రమించింది. అయితే మిగిలిన 4 జట్లలో ఏ రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయనేది ఇంకా నిర్ణయించలేదు. ఈ గ్రూప్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచులు జట్ల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి.
టాస్ కీలకం
షార్జా(Sharjah) క్రికెట్ స్టేడియం పిచ్ నిదానంగా ఉంటుంది. దీనిపై బ్యాట్స్మెన్లు కొంత ఇబ్బంది పడవచ్చు. కానీ మైదానంలోని చిన్న బౌండరీ కారణంగా అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లు కనిపిస్తాయి. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 45 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇది కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ పిచ్‌పై అత్యధిక స్కోరు 215 పరుగులు, ఇది ఆప్గానిస్తాన్ పేరిట నమోదైంది.
గట్టి పోటీ
ఈరోజు ఆస్ట్రేలియా జట్టును ఓడించడం టీమిండియాకు గట్టి సవాల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టోర్నీలో కంగారూ జట్టు అద్భుతమైన ఫాంలో ఉంది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలోనూ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. టీం ఇండియా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా అందులో భారత్ 2 గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా రెండో స్థానంలో ఉంది.
ఇలా గెలిస్తేనే ఛాన్స్
ఎందుకంటే సెమీ ఫైనల్ బెర్త్ ఆశలన్నీ ఈ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ముందుకు సాగాలంటే ఎలాగైనా ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా తప్పక గెలవాలి. అంతేకాదు భారత జట్టు 61 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించినట్లయితే నెట్ రన్ రేట్ పరంగా వారిని అధిగమించవచ్చు. దీంతో భారత్ నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లనుంది. ఈ మ్యాచ్‌లో 60 లేదా అంతకంటే తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించినా కూడా సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న భారత్ ఆశలు మాత్రం నెరవేరవు.
ఇవి కూడా చదవండి:
Team India: మూడో టీ20లో బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్
Online Shopping Tips: పండుగల సీజన్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Read More Sports News and Latest Telugu News