Share News

Jasprit Bumrah: చరిత్ర సృష్టించేందుకు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం.. రికార్డు సృష్టిస్తాడా

ABN , Publish Date - Sep 19 , 2024 | 07:22 AM

బంగ్లాదేశ్‌తో నేడు జరగనున్న తొలి మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీయడానికి బుమ్రా కేవలం 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. మరి ఈ ఘనతను సాధిస్తాడా లేదా అనేది చూడాలి మరి.

Jasprit Bumrah: చరిత్ర సృష్టించేందుకు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం.. రికార్డు సృష్టిస్తాడా
jasprit bumrah

నేటి నుంచి బంగ్లాదేశ్‌పై (సెప్టెంబర్ 19) ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా(jasprit bumrah) అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు తీయడంలో విజయం సాధిస్తే బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో తన 400 వికెట్లను ఘనతను పూర్తి చేస్తాడు. దీంతో ఈ ఘనత సాధించిన పదో భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌ కోసం ఇప్పటికే భారత జట్టు పూర్తిగా సిద్ధమైంది.

మొదటిసారి

జస్ప్రీత్ బుమ్రా T20 ప్రపంచ కప్ తర్వాత మొదటిసారిగా కనిపించనున్నాడు. శ్రీలంక పర్యటనలో తనకు విశ్రాంతి లభించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరంగా బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ భారత్‌కు చాలా కీలకమని చెప్పవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రా సెలవు రద్దు చేసి, జట్టులో చేర్చారు.


400 వికెట్లకు

ఈ తొలి టెస్టు మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయడంలో విజయం సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పడగొట్టిన ఘనతను దక్కించుకుంటాడు. ప్రస్తుతం బుమ్రా 195 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మొత్తం 397 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో బుమ్రా సగటు 21.10. బుమ్రా మొత్తం 12 సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనతను సాధించాడు. బుమ్రా ఇలా చేస్తే 400 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 10వ భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు.


గతంలో

ఇటివల టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా సంచలనం సృష్టించాడు. ముఖ్యంగా ఫైనల్లో దక్షిణాఫ్రికాపై అద్భుతమైన బౌలింగ్‌ చేశాడు. ఆ సమయంలో ఫాస్ట్ బౌలర్ 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. దీంతోపాటు టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా 159 వికెట్లు, 89 వన్డే మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు తీశాడు. ఇది కాకుండా ఈ ఆటగాడు 70 టీ20 మ్యాచ్‌లలో 89 వికెట్లు పడగొట్టాడు.


అంచనాలు

బంగ్లాదేశ్‌పై మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టు బుమ్రాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఆడిన చివరి టెస్టు సిరీస్‌లో కూడా ఆయన అద్భుత ప్రదర్శన చేశాడు. ఆడిన 4 టెస్టు మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. విశేషమేమిటంటే బుమ్రా తొలిసారి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొనబోతున్నాడు. ఇంతకు ముందు అతను ఈ జట్టుతో ఏ టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఈ నేపథ్యంలో బంగ్లా ఆటగాళ్లను బుమ్రా ఎలా కట్టడి చేస్తాడో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి:

Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read Latest Sports News and Telugu News

Updated Date - Sep 19 , 2024 | 07:24 AM