Share News

Mohammed Shami: ఆ రాత్రి 19వ అంతస్తు బాల్కనీలో నిల్చున్నాడు.. షమీ ఆత్మహత్యాయత్నంపై స్నేహితుడి షాకింగ్ వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jul 24 , 2024 | 03:43 PM

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చేసిన మాయాజాలం క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతకు ముందు వ్యక్తిగతంగా, ఆటపరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న షమీ ఆ ప్రపంచకప్‌తో మళ్లీ గాడిలో పడ్డాడు.

Mohammed Shami: ఆ రాత్రి 19వ అంతస్తు బాల్కనీలో నిల్చున్నాడు.. షమీ ఆత్మహత్యాయత్నంపై స్నేహితుడి షాకింగ్ వ్యాఖ్యలు!
Mohammed Shami

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ (Worldcup)లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) చేసిన మాయాజాలం క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతకు ముందు వ్యక్తిగతంగా, ఆటపరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న షమీ ఆ ప్రపంచకప్‌తో మళ్లీ గాడిలో పడ్డాడు. ఆ టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. షమీ జీవితంలో 2018 సంవత్సరం ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అటు ఫ్యామిలీ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ కెరీర్.. రెండూ ఇబ్బందుల్లో పడ్డాయి. ఆ సమయంలో షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.


షమీ భార్య 2018లో అతడిపై గృహ హింస కేసు పెట్టింది. అదే సమయంలో షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ రెండింటితోనూ షమీ చాలా నలిగిపోయాడని అతడి స్నేహితుడు ఉమేష్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ``ఆ సమయంలో షమీ నాతో పాటు మా ఇంట్లో ఉండే వాడు. తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను అతడు తట్టుకోలేకపోయాడు. దేశానికి ద్రోహం చేశాడనే ఆరోపణలు అతడికి తీవ్ర మనోవేదన కలిగించాయి. అతడు ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నాడ``ని ఉమేష్ తెలిపాడు.


``ఆ రోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకు నేను మంచి నీళ్ల కోసం నిద్ర లేచాను. అప్పటకి షమీ 19వ అంతస్తులో ఉన్న మా ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్నాడు. ఏం జరుగుతోందో నాకు అర్థమైంది. ఆ రాత్రి షమీ జీవితంలో చాలా సుదీర్ఘమైనది. చివరకు కాస్తా ప్రశాంతంగా మారాడు. తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాఫ్తు చేస్తున్న కమిటీ నుంచి షమీకి క్లీన్ చిట్ వచ్చింది. ఆ రోజు అతడు ఎంత సంతోషపడ్డాడో మాటల్లో చెప్పలేను`` అని ఉమేష్ పేర్కొన్నాడు. 2023 ప్రపంచకప్ తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ ఈ ఏడాది ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌నకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుని ప్రాక్టీస్ ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి..

Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై వేటు.. నేనే అతని స్థానంలో ఉండుంటే..


Gautam Gambhir: భారత కోచ్‌ అయ్యేందుకు గంభీర్‌కు అర్హత లేదు.. పాక్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 24 , 2024 | 03:43 PM