Natasa Stankovic: హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఆశ్చర్యం..
ABN , Publish Date - Aug 13 , 2024 | 05:38 PM
విడిపోయినప్పటికీ హార్ధిక్ పాండ్యా- నటాషా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఏదో అంశం గురించి ఫ్యాన్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా నటాషాకు సంబంధించి హార్ధిక్ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. నటాషా ఇష్ట ఇష్టాలకు సంబంధించి రాసుకొచ్చారు. ఆ దంపతులు విడిపోయేందుకు కారణం ఇది అని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విడిపోయినప్పటికీ హార్ధిక్ పాండ్యా- నటాషా (Hardik Pandya) నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఏదో అంశం గురించి ఫ్యాన్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా నటాషాకు సంబంధించి హార్ధిక్ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. నటాషా ఇష్ట ఇష్టాలకు సంబంధించి రాసుకొచ్చారు. ఆ దంపతులు విడిపోయేందుకు కారణం ఇది అని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏంటంటే..?
విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని జూలై 19వ తేదీన ఇన్ స్టాగ్రామ్‌లో హర్ధిక్ పాండ్యా- నటాషా కలిసి పోస్ట్ చేశారు. ఆ వెంటనే కుమారుడు అగస్త్యను తీసుకొని నటాషా సెర్బియా వెళ్లారు. దంపతులు విడిపోయేందుకు కారణం హార్ధిక్ వైఖరి అని, మరొకనితో రిలేషన్ షిప్ అనే వార్తలు వచ్చాయి. అదేం లేదని పాండ్యా ఫ్యాన్స్ అంటున్నారు. అందుకోసం కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు.
అసలు కారణం ఇదేనట..
సోషల్ మీడియాలో నటాషా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ రీల్స్‌లో కొన్ని అంటే ఆమెకు ఇష్టం. అందులో తప్పుగా అర్థం చేసుకోవడం, మోసం చేయడం, అవమానాలు, బెదిరింపులకు సంబంధించిన రీల్స్ ఇష్టపడుతుంటారు. ఇదే విషయాన్ని పాండ్యా ఫ్యాన్స్ తెరపైకి తీసుకొచ్చారు. నటాషాకు మోసం చేయడం ఇష్టం.. అందుకోసమే కాబోలు హార్ధిక్‌తో విడిపోయింది అని రాసుకొచ్చారు.
ఎవరి ఇష్టం వారిది..
వాస్తవానికి సోషల్ మీడియా లేదంటే బహిరంగ ప్రదేశంలో ఎవరికీ నచ్చినట్టు వారు ఉండొచ్చు. పాండ్యాతో విడిపోయినంత మాత్రానా.. సోషల్ మీడియాలో రీల్స్ నచ్చిన అంశాన్ని ప్రస్తావించడం సరికాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని సాకుగా చూపి కామెంట్ చేయడం సరికాదని కోరారు. దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు.. ఇద్దరు పరస్సర అంగీకారంతో విడిపోయారు. అభిమానులు మాత్రం నటాషాదే తప్పు అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన పోస్టులను తెరపైకి తీసుకొచ్చి నానా హంగామా చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..