Share News

Virat Kohli: విరాట్ కోహ్లీని ఆపడం మా వల్ల కాలేదు.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్..

ABN , Publish Date - Oct 11 , 2024 | 08:55 PM

దేశం ఏదైనా, మైదానం ఎక్కడైనా పరుగుల వరద పారిస్తూ రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. వన్డేలు, టెస్ట్‌లు, టీ-20ల్లో సత్తా చాటాడు. ముఖ్యంగా వన్డేల్లో సచిన్ రికార్డులకు కోహ్లీ చేరువగా ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి సత్తా కలిగిన బ్యాటర్‌గా అవతరించాడు

Virat Kohli: విరాట్ కోహ్లీని ఆపడం మా వల్ల కాలేదు.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్..
Virat Kohli

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతటి సత్తా కలిగిన బ్యాటర్‌గా అవతరించాడు కింగ్ కోహ్లీ (Virat Kohli). దేశం ఏదైనా, మైదానం ఎక్కడైనా పరుగుల వరద పారిస్తూ రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్నాడు. వన్డేలు, టెస్ట్‌లు, టీ-20ల్లో సత్తా చాటాడు. ముఖ్యంగా వన్డేల్లో సచిన్ రికార్డులకు కోహ్లీ చేరువగా ఉన్నాడు. వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోరు 183 పరుగులు. 2012 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై కోహ్లీ ఈ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ బౌలింగ్ ఎటాక్ అత్యంత బలంగా ఉండే రోజుల్లో కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌తో తన సత్తా చాటాడు. 330 పరుగులు టార్గెట్ ఇచ్చిన పాకిస్తాన్‌ను ఓడించాడు (India vs Pakistan).


ఆ సమయంలో పాకిస్తాన్ జట్టుకు మిస్బావుల్ హక్ (Misbah-ul-Haq) కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ ఆడిన ఇన్సింగ్స్‌ గురించి తాజాగా మిస్బావుల్ స్పందించాడు. ``ఎలాంటి పరిస్థితుల్లోనైనా 330 పరుగుల టార్గెట్ అంటే తేలిక కాదు. పైగా మేం తొలి ఓవర్లోనే వికెట్ తీశాం. ఆ తర్వాత ముగ్గురు బ్యాటర్లు మమల్ని ఓడించారు. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో వాళ్లు అద్భుతంగా ఆడారు. సచిన్, రోహిత్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇక, కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడిని ఆపడం మా వల్ల కాలేదు. అతడి బ్యాటింగ్‌కు మా దగ్గర సమాధానం లేదు`` అని మిస్బావుల్ అన్నాడు.


ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనె ఎదురుదెబ్బ తగిలింది. రెండే బంతులు ఎదుర్కొని ఓపెనర్ గంభీర్ వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ, మరో ఓపెనర్ సచిన్‌ (52)తో కలిసి రెండో వికెట్‌కు 133 పరుగులు చేశాడు. సచిన్ అవుటైన్ తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ (68)తో కలిసి మూడో వికెట్‌కు 172 పరుగులు జోడించాడు. విజయం ఖరారైన తర్వాత కోహ్లీ (183) అవుటయ్యాడు. చివరకు 330 పరుగుల భారీ లక్ష్యాన్ని 47.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించి విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 11 , 2024 | 08:55 PM