Share News

Ruturaj Gaikwad: బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌లో ఉంటేనే టీమిండియాలో చోటు.. సీఎస్కే మాజీ ఆటగాడి ఘాటు విమర్శలు!

ABN , Publish Date - Jul 21 , 2024 | 11:44 AM

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శ్రీలంక టూర్ కోసం ఎంపిక చేసిన టీ20, వన్డే జట్లపై తీవ్ర అసంతృప్తులు చెలరేగుతున్నాయి. పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లను పక్కన పెట్టడంపై మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారు.

Ruturaj Gaikwad: బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌లో ఉంటేనే టీమిండియాలో చోటు.. సీఎస్కే మాజీ ఆటగాడి ఘాటు విమర్శలు!
Ruturaj Gaikwad

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శ్రీలంక టూర్ (Sri Lanka tour) కోసం ఎంపిక చేసిన టీ20, వన్డే జట్లపై (TeamIndia Selection) తీవ్ర అసంతృప్తులు చెలరేగుతున్నాయి. పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లను పక్కన పెట్టడంపై మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారు. అవకావం వచ్చిన ప్రతిసారి అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ (Abhishek Sharma) లాంటి యువ ఆటగాళ్లను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)ను శ్రీలంక టూర్‌కు ఎంపిక చేయకపోవడంపై ఆ జట్టు మాజీ ఆటగాడు ఎస్.బద్రీనాథ్ (S Badrinath) తీవ్రంగా స్పందించాడు.


``శ్రీలంక టూర్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయకపోవడం షాకిచ్చింది. జట్టులోకి ఎంపిక కావడానికి ట్యాలెంట్ కంటే బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఎంతో అవసరమని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. టీమిండియాకు ఆడాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌లో ఉండాలేమో. ఒళ్లంతా టాటూలు వేయించుకోవాలేమో. లేదా, మంచి మీడియా మేనేజర్‌ను కలిగి ఉండాలేమో`` అంటూ బద్రీనాథ్ వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ కోసం కూడా రుతురాజ్‌ను ఎంపిక చేయలేదు.


జింబాబ్వే టూర్‌లో రుతురాజ్ చక్కని ప్రదర్శన చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో 77, 49 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే జింబాబ్వేతో మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరూ ప్రతిభావంతులను కనీసం టీ20 సిరీస్ కోసం కూడా ఎంపిక చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి..

Paris Olympics 2024: మరికొన్ని రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్.. ఈసారి భారత్ నుంచి గతంలో కంటే..


అభిమానికి ఊహించని బహుమతి


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 21 , 2024 | 11:44 AM