Share News

Cricket: విరాట్‌పై అమిత్ మిశ్రా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ ఆటగాడు..

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:42 PM

విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడంటూ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు అమిత్ మిశ్రా వ్యాఖ్యలపై పంజాబ్ జట్టు ఆటగాడు శశాంక్ సింగ్ స్పందించారు. విరాట్ కోహ్లీ అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడని.. ఎంతో సానుకూల ధృక్పదంతో ఆలోచిస్తాని శశాంక్ సింగ్ తెలిపారు.

Cricket: విరాట్‌పై అమిత్ మిశ్రా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ ఆటగాడు..
Indian Cricketers

విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడంటూ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు అమిత్ మిశ్రా వ్యాఖ్యలపై పంజాబ్ జట్టు ఆటగాడు శశాంక్ సింగ్ స్పందించారు. విరాట్ కోహ్లీ అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడని.. ఎంతో సానుకూల ధృక్పదంతో ఆలోచిస్తాని శశాంక్ సింగ్ తెలిపారు. పేరు, ప్రతిష్టలు వచ్చిన తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మారిపోయాడని.. అతని సహచరులతో వ్యవహరించే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయని అమిత్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శంశాంక్ సింగ్ స్పందిస్తూ కోహ్లీతో తనకున్న అనుభవాలను పంచుకున్నాడు.

సాత్విక్‌ జోడీ కొట్టాలి పసిడి!


మిశ్రా ఏమన్నారంటే..

అమిత్ మిశ్రా కోహ్లిని మరో కెప్టెన్ రోహిత్ శర్మతో పోల్చాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కావడానికి ముందు.. అయిన తర్వాత ఒకేలా ఉన్నాడు.. ఎలాంటి మార్పు లేదని మిశ్రా తెలిపారు. కోహ్లీ మాత్రం కెప్టెన్ అయ్యాక తనతో పాటు ఆడినవాళ్లను.. జూనియర్స్‌ను మర్చిపోయారని.. తన వ్యవహరశైలిలో ఎంతో వ్యత్యాసం వచ్చిందని మిశ్రా తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఎక్కువమంది మిశ్రా వ్యాఖ్యలను తప్పుబట్టారు. కొందరు బహిరంగంగా మిశ్రా వ్యాఖ్యలను ఖండిస్తే.. మరికొందరు పరోక్షంగా అమిత్ వ్యాఖ్యలను తప్పబట్టారు.

ICC T20I Rankings: శుభ్‌మన్ గిల్ భారీ జంప్.. టాప్-5 నుంచి పాండ్యా ఔట్


శశాంక్ సింగ్ స్పందన..

పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ విరాట్ కోహ్లీని అభినందించాడు. క్రికెట్ గురించి మాట్లాడేటప్పుడు కోహ్లీ తన విలువైన సమయంలో 40 నిమిషాలు తనకు కేటాయించినట్లు చెప్పాడు. అతడే తనను సహచరుడిలా భావించాడని, ఆటలోని సానుకూల అంశాల గురించి మాత్రమే మాట్లాడాడని చెప్పారు. 40 నిమిషాపాటు క్రికెట్ గురించి మాట్లాడతారని తాను ఎప్పుడూ అనుకోలేదని.. అలాంటిది కోహ్లి తనతో మాట్లాడుతూ.. ఆటలోని ఎన్నో మెళకువలను పంచుకున్నారని శశాంక్ సింగ్ తెలిపారు.


మేము క్రికెట్‌లో టెక్నిక్స్ గురించి, షాట్‌ల గురించి మాట్లాడుకున్నామని.. తాను కెప్టెన్ కోహ్లీతో కాకుండా సహచరుడితో మాట్లాడుతున్నట్లు అనిపించిందన్నారు. తోటి ఆటగాళ్లతో కోహ్లీ చాలా స్నేహపూర్వకంగా ఉంటారనే విషయంతో తనతో మాట్లాడిన తర్వాత అర్థమయిందన్నారు. ఆట పట్ల మరింత ఏకాగ్రత పెరగడానికి, తన ఎదుగుదలకు అవసరమైన సలహాలు, సూచనలు కోహ్లి ఇచ్చారని శశాంక్ సింగ్ పేర్కొన్నారు.కోహ్లీతో మాట్లాడిన తర్వాత, అతడు ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడలేదనే విషయాన్ని తాను గ్రహించానని శశాంక్ వెల్లడించారు. కోహ్లీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటాడని, తాను కేవలం 2 పరుగులు చేసినా నాలో నెగిటివ్స్‌ని కాకుండా.. పాజిటివ్స్ చెప్పి మరింత ప్రోత్సాహం అందించడానికి ప్రయత్నిస్తాడని శశాంక్ తెలిపారు.


India vs Sri Lanka: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. కెప్టెన్ రేసులో ఆ ఇద్దరి మధ్య పోటీ?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 18 , 2024 | 12:42 PM