IPL 2024: పాయింట్ల పట్టికలో సంచలన మార్పు.. టాప్ 4లోకి
ABN , Publish Date - Apr 24 , 2024 | 07:41 AM
ఐపీఎల్ 2024(IPL 2024) పాయింట్ల పట్టికలో మంగళవారం రాత్రి సంచలన మార్పు చోటుచేసుకుంది. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్(CSK), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య మ్యాచ్ జరుగగా.. LSG ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 4 నుంచి మొదటిసారి నిష్క్రమించింది.
ఐపీఎల్ 2024(IPL 2024) పాయింట్ల పట్టికలో మంగళవారం రాత్రి సంచలన మార్పు చోటుచేసుకుంది. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్(CSK), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య మ్యాచ్ జరుగగా.. LSG ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 4 నుంచి మొదటిసారి నిష్క్రమించింది. దీంతో KL రాహుల్(kl rahul) కెప్టెన్‌గా ఉన్న లక్నో సూపర్ జెయింట్ మళ్లీ టాప్ 4లోకి ప్రవేశించింది.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్(RR) IPL 2024 పాయింట్ల పట్టికలో పటిష్టంగా అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే ఈ జట్టు 8 మ్యాచ్‌లలో ఏడు గెలిచింది. రాజస్థాన్ జట్టు మరో మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం ఏడు మ్యాచ్‌లలో 5 గెలిచి రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదే సంఖ్యలో గెలిచింది. అయితే KKR మెరుగైన నెట్ రన్ రేట్‌తో ఉంది.
ఇక CSKని ఓడించి LSG టాప్ 4లోకి ప్రవేశించింది. లక్నో జట్టు కూడా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచింది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలవగలిగింది. ఈ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
ఈ సీజన్‌లో తొలిసారిగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని జట్టు టాప్ 4 నుంచి నిష్క్రమించింది. మరో విషయమేమిటంటే గుజరాత్ టైటాన్స్(GT) కూడా 8 పాయింట్లు సాధించినా సీఎస్‌కే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ఐదో స్థానంలో నిలిచింది. ఆరో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఖాతాలో నాలుగు విజయాలు సాధించగా, ఈ జట్టు 8 మ్యాచ్‌లు ఆడింది.
ఇది కూడా చదవండి:
CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం
Read Latest Sports News and Telugu News