Share News

IND vs SA Final: రోహిత్‌కు అతిపెద్ద సవాల్.. ఫైనల్ మ్యాచ్‌పై గంగూలీ ఏమన్నారంటే..!

ABN , Publish Date - Jun 29 , 2024 | 11:16 AM

టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తున్న ఆటగాళ్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నారు. గెలిచినప్పుడు ప్రశంసలు అందుకోవడంతో పాటు.. ఓడినప్పుడు అభిమానుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలను సాధించింది.

IND vs SA Final: రోహిత్‌కు అతిపెద్ద సవాల్.. ఫైనల్ మ్యాచ్‌పై గంగూలీ ఏమన్నారంటే..!
Ganguly and rohit

టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తున్న ఆటగాళ్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నారు. గెలిచినప్పుడు ప్రశంసలు అందుకోవడంతో పాటు.. ఓడినప్పుడు అభిమానుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలను సాధించింది. అదే సందర్భంగా ఎన్నో ఓటములను మూటగట్టుకుంది. గత ఏడాది వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు రోహిత్ సేన చేరుకున్నప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకోవల్సి వచ్చింది. రోహిత్ పొట్టి ఫార్మట్‌కు గుడ్‌బై చెబుతారని ఓవైపు వార్తలు వస్తున్నాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌ను గెలవడం ద్వారా తాను టీ20 ఫార్మట్‌కు గుడ్‌డై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బార్బడోస్‌లో దక్షిణాఫిక్రాతో టీమిండియా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆడనుంది. ఎనిమిది నెలల కాలంలో భారత్ రెండో ప్రపంచకప్‌ ఫైనల్ ఆడనుంది. 2023 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌‌కు చేరుకున్నప్పటికీ భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఐసీసీ టైటిల్ గెలుచుకునే అవకాశం భారత్‌కు వచ్చింది. దీంతోపాటు రోహిత్ శర్మపై బీసీసీఐ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే అవకాశం దొరికినట్లైంది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ సందర్భంగా భారత క్రికెట్ టీమ్ మాజీ సారధి సౌరవ్ గంగూలీ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

India vs South Africa: ఫైనల్ మ్యాచ్‌కి ముందు.. భారత్ షాకింగ్ నిర్ణయం


రోహిత్‌పై గంగూలీ కామెంట్స్..

రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ రెండుసార్లు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరుకుంది. వన్డే ఫార్మట్‌లో ఫైనల్స్ చేరినా ఆస్ట్రేలియాపై ఓటమి చెందింది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ చేరి ఛాంపియన్స్‌గా నిలిచే అవకాశం లభించిందని గంగూలీ పేర్కొన్నారు. రోహిత్ కెప్టెన్సీపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. రోహిత్ కెప్టెన్సీపై ఆసక్తిగా లేకపోవడంతో.. అతడిని ఆ పోస్టు కోసం ఒప్పించడానికి తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంచెం సమయం పట్టిందన్నారు.

ఫైనల్లో స్వేచ్ఛగా ఆడండి


కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నతర్వాత ఒత్తిడిని జయించి.. సమర్థవంతంగా జట్టుకు ఎన్నో విజయాలు అందించినట్లు తెలిపాడు. ఐపీఎల్‌లో రోహిత్ సత్తా చాటాడని.. తన నాయకత్వంలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ టైటిల్స్ గెలవడం అంత సులభం కాదని.. అయితే అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్ గొప్పదని తాను చెప్పడం లేదన్నారు. ఐపీఎల్‌లోనూ అంతర్జాతీయ క్రికెటర్లు ఆడతారని.. అదే సమయంలో ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన అనుభవం ఉండటంతో ఐసీసీ టోర్నీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే కనీసం 12 నుంచి 13 మ్యాచ్‌లు గెలవాలని.. అదే ప్రపంచకప్ గెలవడానికి 8 నుంచి9 మ్యాచ్‌లు గెలిస్తే సరిపోతుందన్నారు. వరల్డ్ కప్ ‌గెలిస్తే గౌరవం పెరుగుతుందని.. రోహిత్ నాయకత్వంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి దేశ గౌరవాన్ని మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్లు గంగూలీ చెప్పారు. భారత్ జట్టు పూర్తి స్వేచ్ఛతో ఆడాలని.. అన్ని విధాలా ఒత్తిడిని అధిగమించాలని గంగూలీ సూచించారు. తప్పకుండా భారత్ కప్ గెలుస్తుందనే విశ్వాసాన్ని భారత జట్టు మాజీ కెప్టెన్ వ్యక్తం చేశారు.


T20 World Cup final : ఈసారి వదలొద్దు!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jun 29 , 2024 | 11:25 AM