Share News

IPL 2025: ఎస్ఆర్‌హెచ్ షాకింగ్ నిర్ణయం.. ఈ ఆటగాడికి రూ.23 కోట్ల ఆఫర్..

ABN , Publish Date - Oct 16 , 2024 | 06:55 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 ఎడిషన్ మెగా వేలానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఓ ఆటగాడికి ఏకంగా రూ. 23 కోట్లు చెల్లించడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.

IPL 2025: ఎస్ఆర్‌హెచ్ షాకింగ్ నిర్ణయం.. ఈ ఆటగాడికి రూ.23 కోట్ల ఆఫర్..
SRH offer

ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్‌కు ముందు జరగనున్న మెగా వేలం మరికొన్ని రోజుల్లోనే మొదలు కానుంది. నవంబర్ నెలాఖరులో బీసీసీఐ(BCCI) మెగా వేలం నిర్వహించనుందని తెలుస్తోంది. ఇదే సమయంలో అన్ని జట్లు వేలానికి ముందే తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల పేర్లను వెల్లడించాలి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) నుంచి ఓ కీలక వార్త వెలుగులోకి వచ్చింది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆటగాడికి దక్కించుకునేందుకు ఏకంగా రూ. 23 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు తెలిసింది.


ఈసారి మాత్రం

కావ్య మారన్ యాజమాన్యంలోని ఈ ఫ్రాంచైజీ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ లేదా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. అయితే అత్యధిక మొత్తానికి దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్‌ను దక్కించుకునే ఛాన్స్ ఉందని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే హైదరాబాద్ గత సీజన్‌లో ప్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కమిన్స్ రికార్డు దక్కించుకున్నాడు. అంతేకాదు ఆయనను హైదరాబాద్ కెప్టెన్‌గా చేయగా జట్టును ఫైనల్స్‌ వరకు తీసుకెళ్లాడు.


తక్కువకు కెప్టెన్

అయినప్పటికీ అత్యధిక మొత్తం చెల్లించి ఆయనను నిలుపుకోవడానికి SRH సిద్ధంగా లేదని సమాచారం. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ 171 విపరీతమైన స్ట్రైక్ రేట్‌తో 479 పరుగులు చేసిన క్లాసెన్‌ను మొదటి రిటెన్షన్‌గా ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కమ్మిన్స్ దాదాపు రూ.2.5 కోట్లు తక్కువ పొందనున్నాడు. రూ. 18 కోట్లకు ఫ్రాంచైజీ తన కెప్టెన్‌ను రెండో రిటెన్షన్‌గా ఉంచుకోనుందని నివేదిక చెబుతోంది. అదే సమయంలో గత సీజన్‌లో ఓపెనింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన భారత యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మను మూడో స్థానంలో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయనకు రూ.14 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది.


అభిషేక్ కూడా..

అభిషేక్ శర్మ 204.21 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేయడంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్‌లో ముందున్నాడు. ఎందుకంటే నితీష్ ఇటివల ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు T20I లలో భారతదేశం తరపున అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో 11 మ్యాచ్‌లలో 142.92 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. ఆల్ రౌండ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 16 , 2024 | 06:57 PM