Share News

Cricket: రెండో వన్డేలో భారత్‌కు షాక్ ఇచ్చిన శ్రీలంక..

ABN , Publish Date - Aug 04 , 2024 | 10:30 PM

కొలంబొ వేదికగా జరిగిన శ్రీలంక, భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో లంక బౌలర్లు భారత్‌కు షాక్ ఇచ్చారు. అతి తక్కువ లక్ష్యాన్ని చేధించడంతో భారత్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

Cricket: రెండో వన్డేలో భారత్‌కు షాక్ ఇచ్చిన శ్రీలంక..
Srilanka Cricket Team

కొలంబొ వేదికగా జరిగిన శ్రీలంక, భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో లంక బౌలర్లు భారత్‌కు షాక్ ఇచ్చారు. అతి తక్కువ లక్ష్యాన్ని చేధించడంతో భారత్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఓపెనర్లు శుభారంభానిచ్చినా భారత్ 32 పరుగుల తేడాతో ఓటమి చెందింది. శ్రీలంక బౌలర్ జెఫ్రీ వాండర్సే స్పిన్ మాయాజాలంతో భారత్ 208 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక 1-0తో అధిక్యంలో. దీంతో మూడో వన్డేలో భారత్ గెలిచినా వన్డే టోర్ని టైగా ముగుస్తుంది. శ్రీలంక గెలిస్తే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఆగష్టు7న కొలంబొ వేదికగా మూడో మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డే, రెండో వన్డేలోనూ రెండు జట్లు స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యాయి. మొదటి వన్డేలో శ్రీలంక, భారత్ 230 పరుగులు చేయడంతో ఆ మ్యాచ్ టైగా ముగిసింది. రెండో మ్యాచ్‌లో శ్రీలంక 240 పరుగులు చేయగా.. భారత్ 208 పరుగులకే ఆలౌటైంది.


టాస్ గెలిచి..

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఖాతా తెరవకుండానే శ్రీలంక ఓపెనర్ నిషాంక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అవిష్క ఫెర్నాండో, కుషాల్ మెండిస్ మంచి భాగస్వామ్యం నెలకొల్పడానికి తోడు చివరిలో కె మెండిస్ 40, దునిత్ వెల్లలాగే 39 పరుగులతో రాణించడంతో లంక 240 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.


వేగంగా ఆడి..

241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మంచి ఆరంభాన్నిచ్చారు. రోహిత్ 44 బంతుల్లో 64, గిల్ 44 బంతుల్లో 35 పరుగులు చేశారు. ఆ తర్వాత అక్షర పేటల్ 44 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. కేవలం 15 పరుగులలోపే మిగిలిన ఆటగాళ్లు ఔటయ్యారు. వాషింగ్టన్ సుందర్ 15, కోహ్లి 14 పరుగులు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. దీంతో 42.2 ఓవర్లలో 208 పరుగులకే భారత్ ఆలౌటైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 04 , 2024 | 10:30 PM