Virat Kohli: ఎవరూ గుర్తుపట్టని చోట వీధుల్లో తిరుగుతూ!
ABN , Publish Date - Mar 27 , 2024 | 02:27 AM
సుమారు రెండు నెలలపాటు ఆటకు దూరంగా.. కుటుంబంతో గడపడం సరికొత్త అనుభూతి అని విరాట్ కోహ్లీ చెప్పాడు. విరాట్ భార్య అనుష్క కొద్ది రోజుల క్రితం ఓ బాబుకు జన్మనిచ్చింది....
రెండు నెలలు కుటుంబంతో గడిపా
బెంగళూరు: సుమారు రెండు నెలలపాటు ఆటకు దూరంగా.. కుటుంబంతో గడపడం సరికొత్త అనుభూతి అని విరాట్ కోహ్లీ చెప్పాడు. విరాట్ భార్య అనుష్క కొద్ది రోజుల క్రితం ఓ బాబుకు జన్మనిచ్చింది. కూతురు వామికతో కలసి విరాట్ లండన్‌లోని ఓ రెస్టారెంట్లో కనిపించిన ఫొటోలు వైరలయ్యాయి. భార్యతో ఉండడం కోసం ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీ్‌సకు కూడా దూరమైన కోహ్లీ.. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్లో మళ్లీ కనిపించాడు. సోమవారం పంజాబ్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఆ కొన్ని రోజులు తాను ఎక్కడ ఉన్నదీ చెప్పాడు. ‘మేం భారత్‌లో లేం. మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని చోట రెండు నెలలపాటు సాధారణ జీవితం గడిపాం. నిజంగా అదో అనిర్వచనీయమైన అనుభూతి. రోడ్లపై తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం కొత్తగా అనిపించింద’ని కోహ్లీ చెప్పాడు.