Share News

Cricket: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. వైరల్ అవుతున్న గంభీర్ నాలుగేళ్ల క్రితం ట్వీట్..

ABN , Publish Date - Jul 19 , 2024 | 08:07 AM

శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది.

Cricket: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. వైరల్ అవుతున్న గంభీర్ నాలుగేళ్ల క్రితం ట్వీట్..
Sanju and Gambhir

శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. భారత క్రికెట్ టీమ్ శ్రీలంక పర్యటన నుంచి గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికైన జట్టుపై క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒకప్పుడు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని పిలిచే ఆటగాడికి వన్డే సిరీస్ కోసం జట్టులో చోటు ఇవ్వకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు సిరీస్‌లకు బీసీసీఐ వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను, వన్డే జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. శ్రీలంకతో జరిగే వన్డే సీరిస్ కోసం వికెట్‌కీపర్ అండ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఇటీవల కాలంలో సంజూ ప్రదర్శన అద్భుతంగా ఉన్నప్పటికీ వన్డే జట్టులో స్థానం దక్కలేదు. 2020లో గౌతమ్ గంభీర్ సంజుకు మద్దతుగా ఒక ట్వీట్ చేశారు. సంజూ శాంసన్ భారతదేశంలో అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, దేశంలోని అత్యుత్తమ యువ బ్యాట్స్‌మెన్ అని గంభీర్ చెప్పారు. గతంలో సంజూ శాంసన్‌కి జట్టులో స్థానం కల్పించాలని స్వరం పెంచిన గంభీర్ ఇప్పుడు అతడికి జట్టులో ఎందుకు స్థానం కల్పించలేదని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

సూర్యకే పగ్గాలు


చివరిగా..

సంజూ శాంసన్ 2023 దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరపున తన చివరి వన్డే మ్యాచ్ ఆడగా.. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులతో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరిగే వన్డే జట్టుకు శాంసన్‌ను ఎంపిక చేయలేదు. అదే సమయంలో టీ20 సిరీస్ కోసం సంజూను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవలి జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లో సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

‘ఆసియా’ పోరుకు అమ్మాయిలు సై


సంజు కెరీర్..

సంజూ శాంసన్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున 16 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 56.66 సగటుతో 510 పరుగులు చేయగా.. 3 ఆఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అదే సమయంలో టీ20లో 21.14 సగటుతో 444 పరుగులు చేశాడు. టీ20లో టీమిండియా తరఫున 2 హాఫ్ సెంచరీలు చేశాడు.


తులిక..తెచ్చేనా పతకం ?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 19 , 2024 | 08:07 AM