After Rohit Sharma: రోహిత్ శర్మ తర్వాత భారత టీ20కి కెప్టెన్ ఎవరు.. పోటీలో ఐదుగురు స్టార్ ప్లేయర్లు
ABN , Publish Date - Jul 01 , 2024 | 12:34 PM
ఇటివల టీ20 ప్రపంచకప్ 2024(t20 world cup 2024) ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రోహిత్ స్థానంలో టీ20 ఇంటర్నేషనల్‌లో ఏ ఆటగాడు భారత జట్టు బాధ్యతలు చేపడతాడనే ప్రశ్న మొదలైంది. ఈ నేపథ్యంలో పోటీలో ఎవరెవరు ఆటగాళ్లు ఉన్నారో తెలుసుకుందాం.
ఇటివల టీ20 ప్రపంచకప్ 2024(t20 world cup 2024) ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న మూడో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma) నిలిచాడు. అయితే టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రోహిత్ శర్మ స్థానంలో టీ20 ఇంటర్నేషనల్‌లో ఏ ఆటగాడు భారత జట్టు బాధ్యతలు చేపడతాడనే ప్రశ్న మొదలైంది. అయితే ఈ రేసులో ఐదుగురు ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి కెప్టెన్ బాధ్యతలు వచ్చే అవకాశం ఉందనే వివరాలను ఇక్కడ చుద్దాం.
హార్దిక్ పాండ్యా
అంతర్జాతీయ టీ20లో భారత జట్టు కెప్టెన్సీకి హార్దిక్ పాండ్యా(Hardik Pandya) గట్టి పోటీదారుగా ఉన్నాడని చెప్పవచ్చు. 2022 టీ20 ప్రపంచకప్ నుంచి రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో హార్దిక్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు. హార్దిక్ సారథ్యంలో భారత జట్టు 16 టీ20లు ఆడి 10 విజయాలు సాధించింది.
శుభ్‌మన్ గిల్
టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత భారత జట్టు ఇప్పుడు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ సమయంలో ఇరు జట్ల మధ్య 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ని(shubman gill) నియమించారు. గిల్ తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహించాడు.
సూర్యకుమార్ యాదవ్
టీ20 ఇంటర్నేషనల్‌లో చాలా కాలంగా నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్(surya kumar yadav) కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. సూర్యకి ఈ ఫార్మాట్ బాగా నచ్చిందని చెప్పవచ్చు. సూర్యకుమార్ 7 టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఆ సమయంలో టీమిండియా 5 మ్యాచ్‌లు గెలిచి 2 ఓడింది.
రిషబ్ పంత్
టీమిండియాకు కాబోయే కెప్టెన్‌గా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(rishabh pant) కూడా పోటీలో ఉన్నాడు. 2022 చివరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 16 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024కి ముందు పంత్ తిరిగి వచ్చాడు. దీని తర్వాత 2024 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. పంత్ కెప్టెన్సీలో భారత జట్టు 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. ఈ సమయంలో జట్టు 2 గెలిచి 2 ఓడిపోవాల్సి వచ్చింది. 1 మ్యాచ్ అసంపూర్తిగా ముగిసింది.
శ్రేయాస్ అయ్యర్
ఐపీఎల్ 2024లో శ్రేయాస్ అయ్యర్(shreyas iyer) కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలుచుకుంది. కోల్‌కతా మెంటర్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్ రేసులో ముందంజలో ఉన్నాడు. కానీ శ్రేయాస్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ రాలేదు. ఈ పోటీలో హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, సుర్య కుమార్ యాదవ్ రేసులో ముందంజలో ఉన్నారు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Dinesh Karthik: దినేష్ కార్తీక్‌కు 2 కీలక పదవులు.. ఐపీఎల్ 2025లో ఈ జట్టు తరఫున..
Cricket: టీమిండియా కొత్త కోచ్.. కెప్టెన్‌పై జైషా సంచలన ప్రకటన..
Alert: జులై 1 నుంచి దేశంలో వచ్చిన 10 కీలక ఆర్థిక మార్పులివే
Read More Sports News and Latest Telugu News