Share News

Gmail Accounts: సెప్టెంబర్ 20 నుంచి ఈ జీమెయిల్ ఖాతాలన్నీ రద్దు.. మీ ఖాతా ఇలా సేవ్ చేసుకోండి..

ABN , Publish Date - Sep 19 , 2024 | 01:29 PM

మీకు కూడా జీమెయిల్ అకౌంట్ ఉందా. దానిని గత రెండేళ్లుగా ఉపయోగించడం లేదా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సెప్టెంబర్ 20, 2024 నుంచి అలాంటి ఖాతాలను గూగుల్ తొలగించనుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలను కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

Gmail Accounts: సెప్టెంబర్ 20 నుంచి ఈ జీమెయిల్ ఖాతాలన్నీ రద్దు.. మీ ఖాతా ఇలా సేవ్ చేసుకోండి..
inactive Gmail accounts

గూగుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ Gmail ID ఉంటుంది. చాలా మంది దానిని యాక్టివ్‌గా ఉంచుతారు. కానీ ఇంకొంత మంది మాత్రం దానిని పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇప్పుడు గూగుల్‌ అలా వదిలేసిన అకౌంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దాదాపు 2 సంవత్సరాల పాటు యాక్టివ్‌గా లేని జీమెయిల్ ఖాతాలను గూగుల్ తీసివేయనుంది. సెప్టెంబర్ 20, 2024 నుంచి గూగుల్ అలాంటి Gmail ఖాతాలను తొలగిస్తుంది. ఈ క్రమంలో అలాంటి ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని కూడా అలర్ట్ చేసింది. దీంతో గూగుల్ తన సర్వర్ స్థలాన్ని ఖాళీ చేయబోతోంది.


తొలగించే హక్కు

Google Inactive Policy ప్రకారం రెండు సంవత్సరాల పాటు ఉపయోగించని గూగుల్ ఖాతాలను తొలగించే హక్కు Googleకి ఉంది. ఈ నిర్ణయం వల్ల లక్షల కొద్ది Gmail ఖాతాలు తొలగించబడతాయి. అయితే గూగుల్ వారి ఖాతాలను తొలగించడానికి ముందు జీమెయిల్ వినియోగదారులకు నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. తద్వారా Gmail వినియోగదారులు వారి డేటాను భద్రపరుచుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఉపయోగించని జీమెయిల్ ఖాతాను ఎలా సేవ్ చేసుకోవాలి. మీ Gmail ఖాతాను తొలగించకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా సేవ్ చేసుకోవచ్చనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


మీ Gmail ఖాతాను ఇలా సేవ్ చేసుకోండి

  • ముందుగా మీ Gmail ఖాతా డియాక్టివేట్ కాకుండా కాపాడుకోవాలనుకుంటే, మీరు మీ Gmail ఖాతాకు లాగిన్ అవ్వాలి

  • ఆ తర్వాత మీ ఖాతా నుంచి ఎవరికైనా ఇమెయిల్‌లను పంపండి, లేదా ఇన్ బాక్సులో ఉన్న మెయిల్‌లను చదవండి అప్పుడు మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది

  • మీరు మీ Google ఫోటోల ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా ఫోటోలను షేర్ చేసినా కూడా మీరు మీ Gmail ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు

  • మీ Gmail ఖాతాకు లాగిన్ చేయడం ద్వారా YouTubeలో వీడియోను ప్లే చేస్తే, ఇది మీ ఖాతా లాక్ చేయబడకుండా నిరోధించబడుతుంది

  • మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి Google సెర్చ్ ఇంజిన్‌లో ఏదైనా టైప్ చేసి వెతకండి. ఈ పద్ధతులతో మీరు మీ Gmail ఖాతాను డీయాక్టివేట్ కాకుండా కాపాడుకోవచ్చు


ఇవి కూడా చదవండి:


Instagram: టీనేజర్ల ఖాతాల విషయంలో ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం.. ఇకపై నియంత్రణ మొత్తం..


Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

For MoreTechnology NewsandTelugu News..

Updated Date - Sep 19 , 2024 | 01:30 PM