Share News

Alert: ఈ 4 పదాలు టైప్ చేస్తే చాలు ఈ ఫోన్ క్రాష్.. టెక్ వర్గాల అలర్ట్

ABN , Publish Date - Aug 24 , 2024 | 09:38 AM

ఐఫోన్(iPhone) వినియోగదారులకు మరోసారి బగ్ సమస్య మొదలైంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ బగ్(bug) వారి ఫోన్లలో కొన్ని పదాలను టైప్ చేస్తున్నప్పుడు ఐఫోన్, ఐప్యాడ్స్ క్రాష్ అవుతున్నాయని చెబుతున్నారు. అయితే అవి క్రాష్ అవడానికి ఏం పదాలు ఉపయోగిస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Alert: ఈ 4 పదాలు టైప్ చేస్తే చాలు ఈ ఫోన్ క్రాష్.. టెక్ వర్గాల అలర్ట్
Apple iPhone

ఐఫోన్(iPhone) వినియోగదారులకు మరోసారి బగ్ సమస్య మొదలైంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ బగ్(bug) వారి ఫోన్లలో కొన్ని పదాలను టైప్ చేస్తున్నప్పుడు ఐఫోన్, ఐప్యాడ్స్ క్రాష్ అవుతున్నాయని చెబుతున్నారు. అయితే అవి క్రాష్ అవడానికి ఏం పదాలు ఉపయోగిస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు సాధారణ అక్షరాలను టైప్ చేయడం వలన Apple పరికరాలు క్రాష్ అవుతున్నాయని ఓ భద్రతా పరిశోధకుడు సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బగ్ కారణంగా ఫోన్ క్రాష్ అయి నిమిషాల వ్యవధిలోనే స్తంభించిపోతోందన్నారు. కొత్త బగ్ కారణంగా ఐఫోన్ హోమ్ స్క్రీన్ కొంత సమయం తర్వాత క్రాష్ అవుతుంది.


బగ్ మొదటిసారి రాలేదు

ఆపిల్(apple) ఐఫోన్(iPhone) వినియోగదారులు బగ్‌లను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు పలు రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. మాస్టోడాన్‌లోని భద్రతా పరిశోధకులు సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త ఐఫోన్ బగ్‌ గురించి ప్రస్తావించారు. ఈ సమయంలో ఆయన బగ్ కారణం, ప్రక్రియను కూడా వివరించారు. ఐఫోన్ యూజర్ యాప్ లైబ్రరీలో లేదా స్పాట్‌లైట్ శోధనలో ప్రత్యేక అక్షరాలను టైప్ చేయడం వల్ల ఫోన్ క్రాష్ అవుతోందని తెలిపారు.


బ్యాకప్ చేసుకోవాలి

iPhone యాప్ లైబ్రరీ లేదా స్పాట్‌లైట్ శోధనలో ఈ 4 అక్షరాలను “ :: ” అని టైప్ చేయడం వలన ఫోన్ హోమ్ స్క్రీన్ క్రాష్ అవుతుంది. ఇలా చేయడం వల్ల కొంతమంది యూజర్ల ఫోన్లు ఫ్రీజింగ్ అయ్యాయని తెలిపారు. ఈ అక్షరాలను నమోదు చేయడం వలన బగ్ యాక్టివేట్ అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో పొరపాటున కూడా ఈ 4 అక్షరాలను టైప్ చేయవద్దని సూచించారు. మీరు ఈ బగ్‌ని తనిఖీ చేయడానికి “::” అని టైప్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రిస్క్ తీసుకునే ముందు మీ iPhoneని ఒకసారి బ్యాకప్ చేసుకోవాలని చెబుతున్నారు. అన్ని ముఖ్యమైన డేటాను మరొక పరికరంలో సేవ్ చేసుకోవాలని వెల్లడించారు. ఈ బగ్ కారణంగా పరికరంలోని మొత్తం డేటా పోతుంది. ఇలాంటి క్రమంలో పొరపాటున కూడా ఇలాంటి అక్షరాలను టైప్ చేయోద్దని అంటున్నారు.


ఆపిల్ నుంచి

అయితే ప్రస్తుతానికి ఈ బగ్‌ గురించి ఆపిల్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. అయితే ఈ రిపోర్టులన్నీ చూస్తుంటే త్వరలో ఐఫోన్‌లో వస్తున్న బగ్‌లను పరిష్కరించేందుకు కంపెనీ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే iOS అప్‌డేట్ తర్వాత వినియోగదారులు ఈ బగ్ నుంచి బయటపడతారా లేదా అనేది చూడాలి.


ఇవి కూడా చదవండి:

Insta Profile Song: ఇన్‌స్టాగ్రామ్‌‌లో అదిరిపోయే ఫీచర్


School Time: గూగుల్ నుంచి 'స్కూల్ టైమ్' ఫీచర్.. రీల్స్ చూస్తే ఇకపై..

Trending Stock: ఇన్వెస్టర్ల పంట పండింది.. ఏడాదిలో 77% లాభాలను ఇచ్చిన షేర్లు..

For More Technology News and Telugu News..

Updated Date - Aug 24 , 2024 | 09:40 AM