Share News

Eye Tracking: ప్రముఖ టెక్ సంస్థ క్రేజీ ఫీచర్..ఇకపై కళ్లతోనే ఫోన్ ఆపరేటింగ్..

ABN , Publish Date - May 17 , 2024 | 08:55 PM

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్(Apple) ఎప్పటికప్పుడూ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అదే ఐ ట్రాకింగ్ (Eye tracking) ఫీచర్‌. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ కళ్ళతో iPhone లేదా iPadని ఆపరేట్ చేయవచ్చని పేర్కొన్నారు.

Eye Tracking: ప్రముఖ టెక్ సంస్థ క్రేజీ ఫీచర్..ఇకపై కళ్లతోనే ఫోన్ ఆపరేటింగ్..
Eye tracking feature in Apple

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్(Apple) ఎప్పటికప్పుడూ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అదే ఐ ట్రాకింగ్ (Eye tracking) ఫీచర్‌. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ కళ్ళతోనే iPhone లేదా iPadని ఆపరేట్ చేయవచ్చని ప్రకటించారు. ఈ ఫీచర్ సాధారణ వినియోగదారులతో పాటు వికలాంగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తద్వారా ఇది వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది.


ఈ ఫీచర్ మీ iPhone లేదా iPad ఫ్రంట్ కెమెరాను ఉపయోగించడం ద్వారా పని చేస్తుంది. ఈ ఫీచర్ కొత్త, పాత iPhone, iPad వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ ఫీచర్ కోసం మీరు కొత్త iPhone కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్ట చేశారు. ఐ ట్రాకింగ్ ఫీచర్‌ను సెటప్ చేయడం దీనిని ఉపయోగించవచ్చన్నారు. ఈ ఫీచర్‌ను మెరుగుపరచడానికి Apple AIని కూడా ఉపయోగించవచ్చని తెలిపారు. కంపెనీ యాప్‌లు, థర్డ్ పార్టీ యాప్‌లకు కూడా సపోర్ట్ చేసే ఈ ఫీచర్‌ని త్వరలో యాపిల్ అందరికీ అందుబాటులోకి తీసుకువస్తుందని స్పష్టం చేశారు.


మీరు ఈ కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్‌ని A12 చిప్‌సెట్‌తో లేదా ఆ తర్వాతి అన్ని iPhoneలు లేదా iPadలలో పొందుతారని Apple తెలిపింది. ఐ ట్రాకింగ్‌ను ఉపయోగించడానికి అదనపు హార్డ్‌వేర్ లేదా సాధనాలు కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది చాలా మందికి సమర్థవంతమైన హ్యాండ్స్ ఫ్రీ సౌలభ్యాన్ని అందిస్తుందని అన్నారు. ఐఫోన్ వినియోగదారులు చాలా కాలంగా మాకోస్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఉపయోగించి స్క్రీన్‌పై దేనినైనా ఎంచుకోవచ్చని వెల్లడించారు.


ఇది కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త


Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Read Latest Technology News and Telugu News

Updated Date - May 17 , 2024 | 08:58 PM