Share News

Insta Profile Song: ఇన్‌స్టాగ్రామ్‌‌లో అదిరిపోయే ఫీచర్

ABN , Publish Date - Aug 23 , 2024 | 04:26 PM

వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో వినూత్న అప్‌డేట్‌లతో ఆకట్టుకుంటున్న మెటా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) కూడా సరికొత్త అప్‌డేట్‌ని తీసుకువచ్చింది.

Insta Profile Song: ఇన్‌స్టాగ్రామ్‌‌లో అదిరిపోయే ఫీచర్

ఇంటర్నెట్ డెస్క్: వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో వినూత్న అప్‌డేట్‌లతో ఆకట్టుకుంటున్న మెటా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) కూడా సరికొత్త అప్‌డేట్‌ని తీసుకువచ్చింది. ఇన్‌స్టా ప్రొఫైల్ సాంగ్ (Insta Profile Song) పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేసుకుంటే భావోద్వేగానికి తగ్గట్టుగా పాటని ప్రొఫైల్‌లో సెట్ చేసుకోవచ్చు. ఇతరులు ఎవరైనా మన ప్రొఫైల్‌ను చూసినప్పుడు ఆ పాట ప్లే అవుతుంది.

అయితే ప్రొఫైల్‌లో సాంగ్ ఆటో ప్లే ఆప్షన్ లేదు. వినియోగదారులు పాట ప్లే చేయడానికి "ప్లే" బటన్‌ను నొక్కాలి. గరిష్ఠంగా 30 సెకన్లపాటు పాటను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ని వినియోగదారులందరికీ అందుబాటులోకి తేవడానికి మెటా సిద్ధమవుతోంది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ అందరు వినియోగదారులకు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మనసుకు నచ్చిన పాటను, మన మూడ్‌కి తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని లైసెన్స్‌డ్ పాటలను మెటా అందుబాటులో ఉంచింది.


ఇందుకోసం అమెరికాకి చెందిన ప్రముఖ సింగర్ సబ్రీనా కార్పెంటర్‌తో ఇన్‌స్టా యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఒకసారి ప్రొఫైల్‌ సాంగ్ సెట్ చేసుకున్నాక.. మనమే మార్పులు చేసేవరకు ప్రొఫైల్‌లో అది అలాగే ఉంటుంది. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్ స్టా స్టేటస్ తరహాలో ఒక రోజులో మాయం కాదు. అంటే మ్యానువల్‌గా మార్చుకుంటేనే పాట మారుతుంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ప్రొఫైల్‌ సాంగ్‌‌ని యాడ్ చేసుకోండిలా...

  • ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ప్లే స్టోర్‌లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోండి

  • తరువాత ఇన్‌స్టా ఓపెన్ చేసి, ప్రొఫైల్‌ ట్యాబ్‌లోకి వెళ్లి ‘ఎడిట్‌ ప్రొఫైల్‌’ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి

  • ‘యాడ్‌ మ్యూజిక్‌ టు యువర్‌ ప్రొఫైల్‌’పై క్లిక్‌ చేయాలి

  • నచ్చిన పాటను సెలెక్ట్ చేయండి

  • క్లిప్‌ నిడివిని ఎంచుకోండి. గరిష్ఠంగా 30 సెకన్ల పాటు సాంగ్‌ని ప్రొఫైల్‌లో పెట్టుకోవచ్చు.

Updated Date - Aug 23 , 2024 | 04:28 PM