Share News

Lava Blaze X: కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన లావా.. ధర ఎంతంటే?

ABN , Publish Date - Jul 10 , 2024 | 06:33 PM

‘బ్లేజ్ ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీదారు లావా (Lava) సరికొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ‘లావా బ్లేజ్ ఎక్స్’ పేరిట భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది.

Lava Blaze X: కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన లావా.. ధర ఎంతంటే?

‘బ్లేజ్ ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీదారు లావా (Lava) సరికొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ‘లావా బ్లేజ్ ఎక్స్’ పేరిట భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. స్టార్‌లైట్ పర్పుల్, టైటానియం గ్రే అనే రెండు రంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్ ప్రారంభం ధర రూ.13,999గా ఉంది. జులై 20 నుంచి లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా స్టోర్‌లలో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంటుంది.


‘లావా బ్లేజ్ ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, మెరుగైన పనితీరు, మరింత ఆకర్షణీయంగా తయారు చేసినట్టు కంపెనీ పేర్కొంది. కాగా ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, టైప్ సీ పోర్ట్‌, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. మిగతా ఫీచర్లలో 6.67-అంగుళాల డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్‌, 64ఎంపీ+2ఎంపీ వెనుక కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డ్యుయెల్ వ్యూ వీడియో, ఫిల్మ్, ప్రో వీడియో, స్లో మోషన్, టైమ్‌లాప్స్, యూహెచ్‌డీ, జీఐఎఫ్, బ్యూటీ, హెడ్‌డీఆర్, నైట్, పోర్ట్రెయిట్, ఏఐ, ప్రో, పనోరమా, ఫిల్టర్స్, మాక్రో, ఏఐ ఎమోజితో సహా అనేక షూటింగ్ మోడ్‌లను ఈ కెమెరాలు అందిస్తున్నాయి.

Updated Date - Jul 10 , 2024 | 06:34 PM