Smartphone: చాలా రోజుల తర్వాత HTC నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్..మోడల్ చుశారా..
ABN , Publish Date - May 15 , 2024 | 05:30 PM
తైవాన్‌కు చెందిన స్మార్ట్ఫోన్ల(smartphone) తయారీ సంస్థ హెచ్‌టీసీ(HTC) త్వరలోనే దేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. కానీ తాజాగా బుధవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి కొత్త స్మార్ట్‌ఫోన్ ఫోటో టీజర్‌ను రిలీజ్ చేసింది.
తైవాన్‌కు చెందిన స్మార్ట్ఫోన్ల(smartphone) తయారీ సంస్థ హెచ్‌టీసీ(HTC) త్వరలోనే దేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. కానీ తాజాగా బుధవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి కొత్త స్మార్ట్‌ఫోన్ ఫోటో టీజర్‌ను రిలీజ్ చేసింది. పోస్టులో HTC U24 సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ మాదిరిగా అనిపిస్తుంది. అయితే దీని మోడల్ లేదా లాంచ్ తేదీ వివరాలను మాత్రం కంపెనీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.
ఈ పోస్టులో Al24U టెక్స్ట్‌తో కనిపిస్తుంది. ఇది HTC U24 సిరీస్ స్మార్ట్‌ఫోన్ కావచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. HTC U24, HTC U24 Pro సిరీస్‌లో ఇది రావచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12 GB RAM, Qualcomm స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC, ఆండ్రాయిడ్ 14 వెర్షన్లో రావచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. HTC U23, U23 ప్రోతో పోలిస్తే ఈ స్మార్ట్ఫోన్లు మరింత అప్గ్రేడ్లను కలిగి ఉండవచ్చు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో పూర్తి HD+ OLED డిస్ప్లేను కలిగి ఉంటుందని అంటున్నారు.
గతేడాది HTC Wildfire E Star స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది 6.5 అంగుళాల LCD డిస్ప్లే (720 x 1,600 పిక్సెల్స్) కలిగి ఉంది. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే Unisoc SC9832E ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫ్రికాలో విడుదల చేశారు. HTC Wildfire E Star 2 GB RAM, 16 GB స్టోరేజ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
మైక్రో SD కార్డ్ ద్వారా దీని స్టోరేజీని విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌లో రన్ అవుతుంది. దీని 3,000 mAh బ్యాటరీ 5W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS, 3.5mm ఆడియో జాక్ కనెక్టివిటీలకు సపోర్ట్ చేస్తుంది.
అయితే ఇండియా(india)లో రానున్న స్మార్ట్ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలతో HTC మళ్లీ ఇండియాకు తిరిగి రానుంది. అయితే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల మోడళ్లతో పోటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి మరి.
ఇది కూడా చదవండి:
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి
Read Latest Technology News and Telugu News