Share News

కౌంటింగ్‌ కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - May 07 , 2024 | 10:26 PM

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్‌ అనంతరం జూన్‌ 4న జరగనున్న కౌంటింగ్‌ ప్రక్రియకు హాజీపూర్‌ మండలం ముల్క ల్లలోని ఐజా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో పూర్తిస్ధాయిలో సౌకర్యా లు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలి

హాజీపూర్‌, మే 7 : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్‌ అనంతరం జూన్‌ 4న జరగనున్న కౌంటింగ్‌ ప్రక్రియకు హాజీపూర్‌ మండలం ముల్క ల్లలోని ఐజా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో పూర్తిస్ధాయిలో సౌకర్యా లు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. మంగళవారం ముల్కల్లలోని కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌లు రాహుల్‌, మోతిలాల్‌, ఆర్డీవో రాములు, ప్రత్యేక ఉప పాలన అధికారి చంద్రకళ, హాజీపూర్‌ తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా చర్యలు తీసుకోవాల న్నారు. కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిం చాలన్నారు. కౌంటర్లు, విద్యుత్‌, ఇంటర్‌నెట్‌, తాగునీరు ఇతర సదుపాయాలు కల్పించాల న్నారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు బాధ్యతాయు తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2024 | 10:26 PM