Share News

Kumaram Bheem Asifabad: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:40 PM

వాంకిడి, జూలై 26: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు.

Kumaram Bheem Asifabad: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

వాంకిడి, జూలై 26: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని గిరిజనఆశ్రమ బాలికలపాఠశాలను ఆక స్మికంగా సందర్శించి పాఠశాల ఆవరణ, తర గతి గదులు, వంటశాల, తాగునీటిసౌకర్యం, పారిశుధ్యం నిర్వహణ తదితర అంశాలను పరి శీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం అయినందున డెంగ్యూ, మలేరియా, ఇతర విషజ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, ఆహారంఅందించే విషయంపై ప్రత్యేకశ్రద్ధ వహించా లని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు నివాస పరిసరాలలో శుభ్రత ఆవశ్యకతపై విద్యార్థులకు వివరించి వారి తల్లిదండ్రులు, చుట్టు పక్కల వారికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలో తాగునీరు, విద్యుత్‌, మూత్రశాలలు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి జ్వరాలతో బాధపడుతున్న వారివివరాలను అడిగి తెలు సుకున్నారు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవా లన్నారు. వైద్యశాలకు ప్రతిరోజు వస్తున్న రోగుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో తుకారాం భట్‌, తదితరులున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 10:40 PM