Share News

Kumaram Bheem Asifabad: వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Sep 06 , 2024 | 10:59 PM

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 6: జిల్లాలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు వినాయకచవితి ఉత్సవాలను జరుపుకోనున్నారు.

Kumaram Bheem Asifabad:  వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

- మండపాలను సిద్ధం చేస్తున్న నిర్వాహకులు

- నేడు వినాయక చవితి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 6: జిల్లాలో వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు వినాయకచవితి ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఇందుకోసం నిర్వా హకులు వినాయక మండపాలను సిద్ధంచేశారు. జిల్లాకేంద్రంతో పాటు జిల్లాలోని 14మండలాల్లో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. మండపాలను అన్నిహంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే వినాయక విగ్రహాలను పలు ప్రాంతాల నుంచి మండపాలకు చేరవేశారు. ఒకరికంటేఒకరు భారీ విగ్రహాలు నెలకొల్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేపడుతున్నారు. పలు మండపాల నిర్వాహకులు లక్కీడ్రా ద్వారా కార్లు, ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు తదితర ఆకర్షనీయమైన బహుమతులతో లక్కీడ్రాలను చేపడుతున్నారు. చవితి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఆయా మండపాల వద్ద బందోబస్తు చేపట్టనున్నారు. నవరాత్రులు పూజలం దుకున్న అనంతరం వినాయక నిమజ్జనాన్ని చేపట్టనున్నారు.

Updated Date - Sep 06 , 2024 | 10:59 PM