Share News

Kumaram Bheem Asifabad: గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టాలి

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:57 PM

ఆసిఫాబాద్‌, జూలై 25: యువతను మత్తులో ముంచి చిత్తుచేసే గంజాయి, డ్రగ్స్‌ వినియోగానికి అడ్డుకట్టవే యాలని, గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలిద్దా మని, సమా జాన్ని కాపాడుదామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad:  గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టాలి

పోస్టర్లను విడుదల చేస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- పోస్టర్లను విడుదల చేసిన కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జూలై 25: యువతను మత్తులో ముంచి చిత్తుచేసే గంజాయి, డ్రగ్స్‌ వినియోగానికి అడ్డుకట్టవే యాలని, గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలిద్దా మని, సమా జాన్ని కాపాడుదామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం డీవైఎప్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన మాదకద్ర వ్యాలను అరికడుదాం-సమాజాన్ని కాపాడుదాం- యువ తను చైతన్య పర్చుదామని చేపడుతున్న అవగాహన సదస్సు పోస్టర్లను ఆయనవిడుదలచేశారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ దేశభవిష్యత్‌ యువతచేతు ల్లో ఉందని, మాదకద్రవ్యాలమత్తులో చిత్తు కావద్ద న్నారు. కార్యక్రమంలో నాయకులు మాలశ్రీ, రాజేం దర్‌, కార్తీక్‌, టికానంద్‌, దినకర్‌, శ్రావణి, నిఖిల్‌, శ్రీకాంత్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలను నాటి సంరక్షించాలి

రెబ్బెన: ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం రెబ్బెన మండలంలోని కైరిగూడలో వనమహోత్సవం, వృక్షారోపన్‌ అభియాన్‌లో ఆయన మాట్లాడారు. మొక్కలునాటితే భావితరాలవారికి కాలుష్య రహి త సమాజాన్ని అందించేందుకు చక్కటిఅవకాశం ఉం టుందన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. సమావేశంలో జీఎంరవిప్రసాద్‌,జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్‌, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌ తిరుపతి, ఎస్‌వోటు జీఎం నరేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 10:57 PM