Kumaram Bheem Asifabad: బాధ్యతలు స్వీకరించిన కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్
ABN , Publish Date - Sep 06 , 2024 | 11:01 PM
కాగజ్‌నగర్, సెప్టెంబరు 6: కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్‌గా శ్రద్ధా శుక్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ రెవెన్యూ డివిజన్‌అధికారిగా సురేష్ పనిచేశారు.
కాగజ్‌నగర్, సెప్టెంబరు 6: కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్‌గా శ్రద్ధా శుక్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ రెవెన్యూ డివిజన్‌అధికారిగా సురేష్ పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీవో కార్యాలయాల్లో సబ్‌కలెక్టర్లకు పోస్టింగులిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికిచెందిన 2022ఐఎఎస్ బ్యాచ్‌కుచెందిన శ్రద్ధా శుక్లాకు తొలిపోస్టింగ్ కాగజ్‌నగర్ కేటాయించారు.
కలెక్టర్‌ను కలిసిన సబ్‌కలెక్టర్
ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అంశాలపై వారు చర్చించారు.