Share News

Kumaram Bheem Asifabad: రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు మొండి చేయి

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:53 PM

ఆసిఫాబాద్‌, జూలై 25: అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు మొండి చేయి చూపారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడుతూ

Kumaram Bheem Asifabad:  రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు మొండి చేయి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌

ఆసిఫాబాద్‌, జూలై 25: అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు మొండి చేయి చూపారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడుతూ జిల్లాకు ప్రాణధారమైన ప్రాణహిత-చేవెళ్ల, అడ ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం ఆ పార్టీకి జిల్లాపై ఉన్నప్రేమ తెలుపుతోందన్నారు. నీతిఆయోగ్‌లో అస్పిరేషన్‌ జిల్లాగా ఎన్నికైనజిల్లాను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమం లో నాయకులు విశాల్‌, విజయ్‌, మురళీ, మల్లికార్జున్‌, సత్యనారాయణ, ప్రహ్లాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 10:53 PM