Share News

Kumaram Bheem Asifabad: రోజంతా మురుసు వర్షం

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:44 PM

బెజ్జూరు, జూలై 25: వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత వరద పోటెత్తి బ్యాక్‌వాటర్‌ కారణంగా జలదిగ్బంధంలోనే 12గ్రామాలు చిక్కుకు న్నాయి.

Kumaram Bheem Asifabad: రోజంతా మురుసు వర్షం

బెజ్జూరు మండలం తలాయి గ్రామానికి చెందిన గర్భిణులను నాటుపడవపై వాగు దాటిస్తున్న అధికారులు

- ఉప్పొంగిన ప్రాణహిత, వాగులు

- జలదిగ్భందంలోనే 12 గ్రామాలు

బెజ్జూరు, జూలై 25: వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత వరద పోటెత్తి బ్యాక్‌వాటర్‌ కారణంగా జలదిగ్బంధంలోనే 12గ్రామాలు చిక్కుకు న్నాయి. కుశ్నపల్లి-సోమిని మధ్యలోలెవల్‌ వంతెన ఉప్పొంగి ప్రవహిస్తోంది. తలాయి-పాపన్నపేట, తలాయి-సోమిని మధ్య ప్రాణహిత బ్యాక్‌వాటర్‌ కార ణంగా దారులన్నీ మూసుకుపోవడంతో బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వాగుఅవతల ఉన్న సుస్మీర్‌, సోమిని, ఇప్పలగూడ, మొగవెల్లి, నాగెపల్లి, బండలగూడ, గెర్రెగూడ, తలాయి, తిక్కపల్లి, భీమారం, పాతసోమని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.బెజ్జూరు ఎస్సై విక్రంవరద ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తంచేశారు. మండలం లోని తలాయిగ్రామానికి చెందిన లంగారి మేఘన, లావణ్యకు నెలలు నిండ డంతో పురిటిసమయం దగ్గరపడింది. దీంతో తహసీల్దార్‌ భూమేశ్వర్‌ ఆదేశాల మేరకు ఆశావర్కర్‌ విమలవారిద్దరినీ నాటుపడవలపైదహెగాం మండలంలోని చిన్నరాస్పెల్లి, ఒడ్డుగూడ గ్రామాల్లోని తల్లిగారి ఇళ్లకు పంపించారు.

ఫ జలదిగ్బంధంలోనే దిందా గ్రామం

చింతలమానేపల్లి: మండలంలో దిందా గ్రామం జలదిగ్బంధంలోనే ఉంది. దిందా గ్రామ ప్రజలకు వారంరోజులుగా రాకపోకలు నిలిచిపో యాయి. బాబా సాగర్‌-నాయకపుగూడవాగు ఉప్పొంగిప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతంలోఉన్న పంటలు పూర్తిగా జలమయమై పంటలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి.

విద్యార్థులను వాగు దాటించిన ఉపాధ్యాయుడు..

పెంచికలపేట: మండలంలోని జైహింద్‌పూర్‌ గ్రామంలో ప్రభుత్వపాఠశా లను చేరాలంటే పెద్దఒర్రెను దాటాల్సి ఉంటుంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లే సమయంలో కొంతమేరకు నీటితో ఉన్న పెద్దఒర్రె ఏకదాటిగా కురిసిన వర్షానికి ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించింది. దీంతో పాఠశాల ముగివాక తిరిగి వస్తున్న క్రమంలో విద్యార్థులు ఒర్రెదాటలేనంతగా ప్రవాహం ఉండడంతో చేసేదేమి లేక ఉపాధ్యాయుడు సంతోష్‌ విద్యార్థులను ఒక్కొక్కరిగా భుజాలపై ఎత్తుకుని క్షేమంగా అవతలి ఒడ్డుకు చేర్చాడు.

వ్యక్తిని రక్షించిన ఎస్సై

సిర్పూర్‌(టి): వర్షాలకు మాకిడి, హుడ్కిలి, జక్కాపూర్‌ రోడ్లు, కల్వర్టుపై వరదనీరు చేరడంతోమహారాష్ట్రకు వెళ్లేరహదారిపై రాకపోకలు నిలిచిపో యాయి. హుడ్కిలి లిఫ్టుఇరిగేషన్‌ వద్ద పెన్‌గంగా వరదనీటిలో వ్యక్తి చిక్కుకుని ఉన్నట్లు విషయం తెలుసుకున్న ఎస్సై దీకొండ రమేష్‌ సిబ్బందితో అక్కడికివెళ్లి ఆ వ్యక్తిని రక్షించారు. కాగా ఆవ్యక్తి రాజురా మహారాష్ట్రలోని రాజుగా చెబుతుండగా మతిస్థిమితం కోల్పోయి ఉన్నట్లు పోలీసు భావిస్తున్నారు.

కాగజ్‌నగర్‌:పట్టణంలోగురువారం ఉద యం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చింది. చిరువ్యాపారులు దుకాణాలు పెట్టలేదు.

కెరమెరి: మండలంలో పలుగ్రామాల సమీపంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల వద్ద సిబ్బందిని కాపలా ఉంచినట్లు ఎంపీడీవో అంజద్‌ పాషా, ఎస్సై విజయ్‌ తెలిపారు.

Updated Date - Jul 25 , 2024 | 10:44 PM