Share News

Kumaram Bheem Asifabad: జలదిగ్బంధంలోనే మగ్గుతున్న గ్రామాలు

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:30 PM

బెజ్జూరు, జూలై 26: ప్రాణహిత నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. తలాయి-పాపన్నపేట, కుశ్నపల్లి- సోమిని గ్రామాల మధ్య ప్రాణహిత బ్యాక్‌వాటర్‌, లోలెవల్‌ వంతెనలపై వరదనీరు ప్రవహిస్తుండడంతో 12 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి.

Kumaram Bheem Asifabad: జలదిగ్బంధంలోనే మగ్గుతున్న గ్రామాలు

బెజ్జూరు, జూలై 26: ప్రాణహిత నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. తలాయి-పాపన్నపేట, కుశ్నపల్లి- సోమిని గ్రామాల మధ్య ప్రాణహిత బ్యాక్‌వాటర్‌, లోలెవల్‌ వంతెనలపై వరదనీరు ప్రవహిస్తుండడంతో 12 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. వాగులు, వంకలు పొంగడంతో ఆయాగ్రామాల ప్రజలకు పూర్తిగా బాహ్యప్రపంచంతో సంబం ధాలు తెగిపోయాయి. వాగు అవతల ఉన్న సుస్మీర్‌, సోమిని, ఇప్పలగూడ, మొగవెల్లి, బండలగూడ, నాగెపల్లి, పాత సోమిని, గెర్రెగూడ, తలాయి, తిక్కపల్లి, భీమారం తదితర గ్రామాల ప్రజలు వారం రోజుల నుంచి వరదలతో బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా వారంరోజుల నుంచి పత్తి పంట పూర్తిగా నీటమునిగి తీవ్రంగా నష్టపోయారు. ఆయాగ్రా మాల ప్రజలు ప్రాణహితవరద నీటలో ప్రమాదపు టంచున నాటుపడవలపై ప్రయాణం చేస్తూ మండలకేంద్రానికి వచ్చి వెళ్తున్నారు. వరదల కార ణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు ఉండడంతో శుక్రవారం బెజ్జూరు ఎస్సై విక్రం సుమారు వందకుటుంబాలకు కూరగాయలు అందజే తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

మా గ్రామాన్ని పట్టించుకోండి..

- దిందా గ్రామస్థుల ఆవేదన

చింతలమానేపల్లి: గ్రామాన్ని ప్రభుత్వం, ఉన్న తాధికారులు పట్టించుకోవాలని దిందా గ్రామస్థులు వేడ్కొంటున్నారు. వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును గ్రామస్థులు శుక్రవారం పరి శీలించారు. పదిహేను రోజులుగా బాహ్య ప్రపం చానికి దూరంగా జలదిగ్బంధంలో ఉన్నామని గ్రామస్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు నిత్యావసర సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేదంటున్నారు. అత్యవసర పరిస్థితు లేర్పడితే దేవుడే దిక్కని ఆవేదన చెందుతున్నారు. గ్రామానికి అటువైపుగా ప్రాణహితనది, ఇటువైపుగా వాగు ఉండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి అంటున్నారు. పిల్లలు చదువులకు దూరమవుతున్నారని అన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి వాగుపై వంతెన నిర్మించి కష్టాలు తొలగించా లని కోరుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సిర్పూర్‌(టి): ఇక్కడ కురుస్తున్న వర్షాలకు, ఎగువన మహారాష్ట్రలో కురు స్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగాలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌శ్రీనివాస్‌ అన్నారు. గురు వారం రాత్రి వరదఉధృతిని ఆయన పరిశీలించి ఎవరూకూడా వాగుదాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, వాగుదాటే ప్రయత్నాలు చేయరాదన్నారు. అత్య వసర సమయంలో టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందిస్తే సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ప్రాణహిత బ్యాక్‌వాటర్‌లో

మునిగిన పంటలు

దహెగాం: ప్రాణహిత ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌తో పంటలు నీటమునిగాయి. శుక్రవారం మండలంలోని రాంపూర్‌, మొట్లగూడ, టేపర్‌గాం, దిగిడ, దుబ్బగూడ, రావుపల్లి గ్రామాల్లో పత్తి, కంది, తదితర పంటలు నీట మునిగినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు సర్వే చేపట్టి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయాగ్రామాల రైతులు కోరుతున్నారు.

పెంచికలపేట: మండల వ్యాప్తంగా శుక్రవారం తేలికపాటి వర్షం కురిసింది. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహించడంతో మురళీగూడ, జిల్లెడ గ్రామాల పంటచేనులు నీటమునిగాయి. నంది గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కూలిన ఇంటి గోడ

కౌటాల: మండలంలోని మొగడ్‌దగడ్‌ గ్రామానికి చెందిన వృద్దురాలు జనాబాయి ఇంటిగోడ శుక్రవారం కూలిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ తడిసి కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా వృద్దురాలి భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతిచెందగా పిల్లలు ఎవరు లేరు. ఇంట్లో ఒక్కతే ఉంటుంది. కౌటాల ఎస్సై మదుకర్‌ స్పందించి బాధితురాలికి రూ.3వేల నగదు, 25కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Updated Date - Jul 26 , 2024 | 10:30 PM