Share News

జ్వరపీడిత గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలి

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:50 PM

మండలంలో జ్వరపీడిత గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సం దర్శించి వైద్య సేవలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబ లే అవకాశం ఉందని, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ప్రబలి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అందుకే జ్వర పీడిత గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలను, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

జ్వరపీడిత గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలి

కాసిపేట, జూలై 24: మండలంలో జ్వరపీడిత గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సం దర్శించి వైద్య సేవలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబ లే అవకాశం ఉందని, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ప్రబలి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అందుకే జ్వర పీడిత గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలను, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వ హించాలన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయం లోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది వనమహోత్సవం లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం దేవాపూర్‌లో వయోజన విద్యాశాఖ పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిం చిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవం కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. మహిళల్లో అక్షరాస్యత పెంపొందడం వల్ల నవ సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. అక్షరాస్య తకు కృషి చేసిన ట్రస్టు ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రెడ్డిమల్ల ప్రకాష్‌, డీఆర్‌పీలు వెంక టేశ్వర్లు, బండ శాంకరిలను కలెక్టర్‌ అభినందించారు. డీపీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ తిరుపతి, డీటీడీవో గంగారాం, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్‌, తహసీల్దార్‌ భోజన్న, ఎంపీవో సప్దర్‌ ఆలీ పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి

మంచిర్యాల కలెక్టరేట్‌: మొక్కల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భావితరా లకు మంచి వాతావరణం అందించడం బాధ్యతగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. నాటేందుకు అవసరమైన మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలని, జిల్లాలో ని మున్సిపాలిటీల వారీగా మొక్కలు నాటడంపై లక్ష్యాలను నిర్ధేశించామని, లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. సెప్టెంబరు 15 నాటికి బ్యాగ్స్‌ కన్వర్షన్‌కు మొక్కలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రతి నర్సరీలో సుమారు 2 వేల వరకు వెదురు మొక్కలను పెంచాలని, వచ్చే సంవత్సరం అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దుల్లో నాటాలన్నారు. జిల్లాలో మామిడి, జామ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాల న్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకొంటామన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 10:50 PM