Share News

ప్రైవేట్‌ పిల్లల వైద్యులతో సమావేశం

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:54 PM

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల యంలో బుధవారం పిల్లల వైద్యులతో డీఎంహెచ్‌వో అనిత సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధు లను వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా నివారించవచ్చని తెలిపారు.

ప్రైవేట్‌ పిల్లల వైద్యులతో సమావేశం

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 24: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల యంలో బుధవారం పిల్లల వైద్యులతో డీఎంహెచ్‌వో అనిత సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధు లను వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా నివారించవచ్చని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల వివరాలను జిల్లా కార్యాలయానికి తెలియజేయాలన్నారు. పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్‌ వివరాలను ప్రదర్శించాలన్నారు. ఆసుపత్రులు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని సూచించారు. వైద్యుల వివరాలు, వైద్య సేవలు వాటి ధరల పట్టికలను ప్రదర్శించాలని లేకుంటే చర్యలు తీసుకొంటామ న్నారు. డాక్టర్‌ అతుల్‌, వైద్యులు మల్లేష్‌, కుమార్‌, సురేష్‌కుమార్‌, పటేల్‌, దివ్య, అనిల్‌రెడ్డి,రఘువంశీ, రాజేష్‌, శ్రీనివాస్‌, డాక్టర్‌ కృపాబాయ్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ పద్మ, బుక్కా వెంకటేశ్వర్లు, తదిరతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 10:54 PM