Share News

ఓట్లు వేయండి.. సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - May 08 , 2024 | 10:51 PM

ఎన్నికలను బహిష్కరించవద్దని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే కీలకమని, ఓట్లు వేయండి సమస్యలను పరిష్కరిస్తామని బుధవారం రాజారం గ్రామస్థులతో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ అన్నారు.

ఓట్లు వేయండి.. సమస్యలు పరిష్కరిస్తాం

కోటపల్లి, మే 8: ఎన్నికలను బహిష్కరించవద్దని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే కీలకమని, ఓట్లు వేయండి సమస్యలను పరిష్కరిస్తామని బుధవారం రాజారం గ్రామస్థులతో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ అన్నారు. గ్రామ సమస్యలు పరిష్కరించే వరకు ఓట్లు వేయమని, ఎంపీ ఎన్నికల్లో పాల్గొనేది లేదంటూ గ్రామస్థులు తీర్మానించిన విషయం తెలి సిందే. రెండు దఫాలుగా అధికారులు గ్రామస్థులతో సమావేశమై చర్చ లు జరిపినా వారు ఓట్లు వేసేందుకు ససేమిరా ఒప్పుకోకపోగా, పోల్‌ చిట్టీల పంపిణీని బహిష్కరించారు. బుధవారం అధికారుల బృందం మరోసారి గ్రామస్థులతో చర్చలు జరిపింది. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, అయితే అటవీ అనుమతుల కోసం నివేదిక పం పామని లేఖను అదనపు కలెక్టర్‌ గ్రామస్థులకు చూపించారు. ఓట్లకు దీనికి లింకు పెట్టవద్దని, ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎవరు గెలిచినా వారి వద్దకు వెళ్లి సమ స్యలను పరిష్కరించుకుందామని, ఇందుకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఓట్లు వేసే విషయంపై అందరం కలిసి నిర్ణ యం తీసుకుంటామని గ్రామస్థులు తెలిపారు. పోల్‌ చిట్టీలు మళ్ళీ ఇవ్వ రని తెలుపడంతో పోల్‌ చిట్టీలు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశా రు. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో భూమన్న, తహసీల్దార్‌ మ హేందర్‌, సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ రాజేందర్‌, కార్యదర్శి రమ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 10:51 PM