Share News

కులం, మతం వివరాలు ఇవ్వకపోయినా బడిలో ప్రవేశాలు: హైకోర్టు

ABN , Publish Date - Oct 23 , 2024 | 03:57 AM

పాఠశాల ప్రవేశాలు, టీసీ, ఎస్‌ఎస్సీ ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ ఫాంలు, ఇతర ప్రభుత్వ దరఖాస్తుల్లో కులం, మతం వివరాలు అడిగిన చోట ‘నో రిలీజియన్‌.. నో క్యాస్ట్‌’ అని రాయవచ్చునని.

కులం, మతం వివరాలు ఇవ్వకపోయినా బడిలో ప్రవేశాలు: హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పాఠశాల ప్రవేశాలు, టీసీ, ఎస్‌ఎస్సీ ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ ఫాంలు, ఇతర ప్రభుత్వ దరఖాస్తుల్లో కులం, మతం వివరాలు అడిగిన చోట ‘నో రిలీజియన్‌.. నో క్యాస్ట్‌’ అని రాయవచ్చునని.. కులం, మతం వివరాలు ఇవ్వకపోయినంత మాత్రాన స్కూల్‌ అడ్మిషన్‌ తిరస్కరణకు గురికాబోదని హైకోర్టు స్పష్టం చేసింది. ‘నో రిలీజియన్‌.. నో క్యాస్ట్‌’ అని రాయవచ్చునని పాఠశాల విద్యాశాఖ పేర్కొంటున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. జనన, మరణాలు, పాఠశాల అడ్మిషన్లు తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దరఖాస్తుల్లో ‘నో రిలీజియన్‌.. నో క్యాస్ట్‌’ కాలం ఉండేలా ఆదేశాలివ్వాలని జర్నలిస్టు డీవీ రామకృష్ణారావు, ప్రభుత్వ ఉద్యోగి సలాడి క్లారెన్స్‌ 2017లో పిల్‌ వేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రీనివాసరావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

Updated Date - Oct 23 , 2024 | 03:57 AM